Bike: ఒకే బైక్ పై ఐదుగురు.. షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు..

ద్విచక్ర వాహనాలు అంటే ఏముంటాయి.. బైక్ లు, స్కూటీలు ఉంటాయి. అయితే ఈ ద్విచక్ర వాహనంపై ఎంత మంది వెళ్లొచ్చు. కనీసం ఒక్కరు గరిష్ఠింగా ఇద్దరు వెళ్లాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్తుంటారు. అయితే ట్రాఫిక్ నిబంధన ప్రకారం ఇద్దరే వెళ్లాలి. ముగ్గురు వెళ్తే ట్రిఫుల్ రైడింగ్ ఫైన్ వేస్తారు. అయితే ఓ ద్విచక్ర వాహనం ఐదుగురు వెళ్లారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.

చిత్రకూట్ జిల్లాలోని ఖోహ్ గ్రామంలో ఓ బైక్‌పై ఐదుగురు కూర్చొని వెళ్తున్నారు. జాలిగా వెళ్తున్న వారిని ట్రాఫిక్ పోలీసులు చూశారు. చిత్రకూట్‌ ట్రాఫిక్‌ టీఎస్‌ఐ శైలేంద్రకుమార్‌ సింగ్‌ ఆ బైక్‌ నడిపే కుర్రాళ్లను అడ్డుకున్నారు. వారికి ఏకంగా రూ.17 వేలు ఫైన్ వేస్తూ చలానా విధంచారు. అంతే కాదు బైక్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఖోహ్ గ్రామంలో ఐదుగురు కుర్రాళ్లు బైక్‌పై వెళుతూ ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించారని శైలేంద్రకుమార్‌ సింగ్‌ తెలిపారు.

The incident of five people riding the same bike happened in UP

వెంటనే వారిని అడ్డుకున్నామని చెప్పారు. వారి పేర్లుతిసుకుని, అలాగే అడ్రస్ కూడా తెలుసుకున్నట్లు చెప్పారు. వారికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా చెక్ చేసినట్లు చెప్పారు. వారు హెల్మెట్ లేకుండా.. లైసెన్స్ లేకుండా బైక్ పై వెళ్తున్నారని చెప్పారు. అందుకే వైరికి రూ.17 వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. బైక్ ను సీజ్ చేసినట్లు చెప్పారు. బైక్ పై ఇద్దరి కంటే ఎక్కువ వెళ్లకూడదని చెప్పారు.

మనం కూడా చాలా ప్రాంతాల్లో బైక్ పై ముగ్గురు వెళ్తుంటే చూస్తాం. అలా వారు ట్రాఫిక్ పోలీసుల కంట పడితే భారీగా జరిమానా విధిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+