తమిళనాడులో మాజీ మంత్రికి షాక్ ఇచ్చిన కర్ణాటక లోకాయుక్త, మైనింగ్ మాఫియాతో !

అక్రమ మైనింగ్‌కు సంబంధించి కోయంబత్తూరులోని డీఎంకే పార్టీకి చెందిన మాజీ మంత్రి పొంగళూరు పళనిస్వామి కుమారుడి ఇంటిపై కర్ణాటక లోకాయుక్త పోలీసులు గురువారం దాడి చేశారు. మాజీ మంత్రి కుమారుడు పారి నివాసంలో సోదాలు చేసిన అధికారులు పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.

తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీకి చెందిన మాజీ మంత్రి పొంగళూరు పళనిస్వామి కుమారుడు, తమిళనాడు క్రీడా జట్టు రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ అయిన పారికి ఇప్పుడు సినిమా కష్టాలు ఎదురైనాయి. కోయంబత్తూరులోని కృష్ణా కాలనీలోని పారి నివాసంపై 15 మంది సభ్యులతో కూడిన కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాడి చేశారు. పారి, అతని తండ్రి పొంగళూరు పళనిస్వామి కర్ణాటకలో మైనింగ్ చేస్తున్నారని అధికారులు చెప్పారు.

The Karnataka Lokayukta Police raided the house of former Tamil Nadu ministers son

నిబంధనలకు విరుద్ధంగా తండ్రీ కొడుకు క్వారీలు నిర్వహిఇస్తున్నారని అధికారులు ఆరోపించారు. ఆ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు కర్ణాటక లోకాయుక్త అధికారులు తెలిపారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన వాహనాల్లో వచ్చిన అధికారులు కోయంబత్తూరు సిటీకి వెళ్లి తనిఖీలు నిర్వహించి తరువాత సమాచారం సేకరించి వెళ్లిపోయారు.

The Karnataka Lokayukta Police raided the house of former Tamil Nadu ministers son
i

తర్వాత మళ్లీ అధికారులు గురువారం మధ్యాహ్నం వెళ్లి అదే ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ దాడిపై తమిళనాడు బీజేపీ చీఫ్, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై మాట్లాడుతూ అనుమతించిన తరువాత కూడా పరిమితికి మించి అక్రమ మైనింగ్ నిర్వహించడం వలనే కర్ణాటక లోకాయుక్త అధికారులు డీఎంకే పార్టీ మాజీ మంత్రి తిరు పొంగళూరు పళనిస్వామి, ఆయన కుమారుడి ఇంటిలో సోదాలు చేశారని, అవినీతికి కేరాఫ్ అడ్రస్ డీఎంకే పార్టీ అని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+