మంత్రికి మూడు ఏళ్లు జైలు శిక్ష, మంత్రి భార్యకు అదే శిక్ష, సీఎంకు చాలా క్లోజ్
అక్రమాస్తుల కేసులో తమిళనాడు కేబినెట్‌లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పని చేసిన డీఎంకే పార్టీ సీనియర్ నేత కె. పొన్ముడికి మద్రాస్ హైకోర్టు గురువారం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అవినీతి, అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన తర్వాత మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోయిన తొలి డీఎంకే నాయకుడు పొన్ముడి.
అయతే అంతకు ముందే అక్రమాస్తుల కేసులో ఏఐఏడీఎంకే చీఫ్, దివంగత ముఖ్యమంత్రి జయలలిత, బాలకృష్ణారెడ్డి తర్వాత తమిళనాడులో ఎమ్మెల్యే సభ్యత్వం కోల్పోయిన మూడో నాయకుడిగా పొన్ముడి రికార్డులకు ఎక్కాడు. అవినీతి నిరోధక చట్టం కింద పొన్ముడి, ఆయన భార్య పి విశాలాక్ష్మి దోషులుగా నిర్ధారించిన రెండు రోజుల తరువాత గురువారం మద్రాసు హైకోర్టు జస్టిస్ జి జయచంద్రన్ భార్యాభర్తలిద్దరికీ మూడేళ్ల సాధారణ జైలు శిక్ష విధించారు.

పొన్ముడి, ఆయన భార్య విశాలాక్ష్మి సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి వీలుగా శిక్షను ఒక నెలపాటు సస్పెండ్ చేశారు. స్టాలిన్ ప్రభుత్వంలోని మరో మంత్రి వి సెంథిల్ బాలాజీ మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణలో జైలుకు వెళ్లారు. స్టాలిన్ ప్రభుత్వంలోని మరో మంత్రి పొన్ముడితో పాటు ఆయన భార్యవిశాలాక్ష్మి నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు 2016 ఏప్రిల్ 18వ తేదీన తీర్పు వెలువరించింది.
అయితే కిందికోర్టు తీర్పు ఉత్తర్వులు తప్పని, ఆ తీర్పు సమర్థనీయం కాదని మద్రాసు హైకోర్టు జస్టిస్ జయచంద్రన్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రి పొన్ముడి గతంలో ప్రొఫెసర్‌గా పని చేశారు. ప్రొఫెసర్ స్థాయి నుంచి విద్యాశాఖా మంత్రిగా, రాజకీయవేత్తగా మారిన పొన్ముడి డీఎంకే పార్టీలో ఐదు మంది జనరల్ సెక్రటరీలలో ఒకరిగా పని చేస్తున్నారు.

2006 నుంచి 2011 మధ్య కాలంలో తమిళనాడు ఉన్నత విద్య, గనుల శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో మంత్రి పొన్ముడి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరుక్కున్నారు. పొన్ముడితో పాటు ఆయన భార్య విశాలాక్ష్మ కూడా కేసులో చిక్కుకున్నారు. భార్యాభర్తలిద్దరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డీవీఏసీ) హైకోర్టులో అప్పీల్ చేసింది. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి డీఎంకే పార్టీ సీనియర్ నాయకడు, మంత్రి పొన్ముడితో పాటు ఆయన భార్యకు జైలు శిక్ష వధించడం కలకలంరేపింది.












Click it and Unblock the Notifications