సీఎం సీటు సేఫ్ గా ఉంది, ఖాళీ లేదని తెలిసినా ప్రయత్నాలు, మంత్రి సంచలనం
ముఖ్యమంత్రి సీటు ఖాళీ లేదని, దానిపై మా రాముడు సిద్దరామయ్య కూర్చున్నారని, ఆ కుర్చీలోంచి రామునుడికి కిందకు దింపడం చాలా కష్టం అని, మా రాముడు చాలా మంచివాడు అని కర్ణాటక గృహనిర్మాణ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ అన్నారు. బెంగళూరులో గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి జమీర్ అహమ్మద్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీటు చాలా సేఫ్ గా ఉందని అన్నారు.
హైకమాండ్ అంగీకరిస్తే నేను సీఎం అయ్యేందుకు సిద్ధమని మాజీ మంత్రి ఆర్.వి. దేశ్ పాండే చేసిన వ్యాఖ్యలపై మంత్రి జమీర్ అహ్మద్ స్పందిచారు. ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారని, అందులో తప్పులేదని, అయితే ప్రస్తుతం కర్ణాటక సీఎం కుర్చీ ఖాళీ లేదని మంత్రి జమీర్ అహ్మద్ అన్నారు. ఇటీవల సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై మంత్రి జమీర్ అహ్మద్ స్పందిస్తూ.. మనుషులకు శత్రువులు ఉండడం సహజమే అని అన్నారు.

ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు. చాలా సందర్బాల్లో మన పక్కనే ఉన్న వాళ్లలో శత్రువు ఎవరో, మిత్రులు ఎవరో అని ఎలా తెలుస్తుంది..?, అని సిద్ధరామయ్య అన్నారని, అందులో తప్పు ఏమీ లేదని మంత్రి జమీర్ అహ్మద్ అన్నారు.ముడా మాజీ కమిషనర్ దినేష్ కుమార్ సస్పెన్షన్ విషయం గురించి నాకు తెలియదని, అధికారి సస్పెన్షన్ కు సీఎం సిద్ధరామయ్యకు సంబంధం ఏంటని మంత్రి జమీర్ అహ్మద్ మీడియాను ప్రశ్నించారు.
హీరో దర్శన్ విషయంలో మీడియాలో నా పేరు వచ్చిందని, దర్శన్, నేను చాలా స్నేహితులమని,. కానీ దర్శన్ తప్పు చేసి జైలుకు వెళ్లాడని, తప్పు చెయ్యకుండా ఎవరైనా జైలుకు వెళ్తారా అని మంత్రి జమీర్ అహ్మద్ అన్నారు. కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ చాలా ఎక్కువగా ఉందని, బీజేపీలో ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఎమ్మెల్యే టిక్కెట్ అడిగే నాయకుడే కరువు అయ్యారని మంత్రి జమీర్ అహమ్మద్ వ్యంగంగా అన్నారు. మొత్తం మీద కర్ణాటకలో సీఎం కుర్చీ ఖాళీ లేదని చెప్పిన మంత్రి జమీర్ అహ్మద్ ముఖ్యమంత్రి ప్రత్యర్థి వర్గానికి షాక్ ఇచ్చారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications