Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెడ్ రూమ్ లో ప్రియుడితో తల్లి రొమాన్స్ చేస్తుంటే కూతురు ఎంట్రీ ఇచ్చింది, కట్ చేస్తే పోలీసులు ?

వివాహం చేసుకున్న దంపతులకు ఓ కుమార్తె ఉంది. భర్త దూరం అయిన తరువాత ఆమె కూతురితో కలిసి సొంత ఊరికి వెళ్లిపోయింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తల్లి అదే శాఖలో ఉద్యోగం చేస్తున్న కేఏఎస్ అధికారితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోంది. ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంటున్న తల్లి ఆమె ఇంట్లోనే కన్న కూతురి ముందే ప్రియుడితో జల్సా చేస్తోంది.

తన తల్లి అక్రమ సంబంధాన్ని చూసినందుకు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ తొమ్మిదేళ్ల బాలిక తన తల్లిపై, ఆమె ప్రియుడి మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. బాధితురాలు అయిన బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్ణాటకలోని కలబురగిలోని బ్రహ్మపూర్ పోలీస్ స్టేషన్ లో హాస్టల్ వార్డెన్ గా ఉద్యోగం చేస్తున్న బాలిక తల్లి మీద, కేఏఎస్ అధికారి రామన గౌడ్‌పై కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

The mother tortured her daughter who came in while she was in the bedroom with her boyfriend

కర్ణాటకలోని కలబురగిలో నివాసముంటున్న బాలిక తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆ తర్వాత బాలిక తల్లి బెళగావి జిల్లాలోని ఆమె స్వగ్రామంలో స్థిరపడింది. బైలహోంగళలోని ఓ హాస్టల్‌లో బాలిక తల్లి వార్డెన్‌గా పనిచేస్తోంది. తల్లి ఆమె ఉద్యోగం చేస్తున్న డిపార్ట్‌మెంట్‌కు చెందిన కేఏఎస్ అధికారి రామన గౌడతో అక్రమ సంబంధం పెట్టుకుంది. హాస్టల్ లేడీ వార్డెన్ ఆమె ప్రియుడు అయిన కేఏఎస్ అధికారి రామన గౌడను ఇంటికే పిలిపించుకుని కుమార్తె ముందే బెడ్ రూమ్ లోకి వెళ్లి రొమాన్స్ చేస్తూ ప్రైవేట్ క్షణాలు గడిపారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని తన కన్నతల్లి, ఆమె ప్రియుడు రామన గౌడ తనను శారీరకంగా, మానసికంగా హింసించారని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న తనను చంపుతానని తన తల్లి తనతో చాలాసార్లు చెప్పిందని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేను కొన్ని రోజుల క్రితం తన తల్లి, ఆమె ప్రియుడు రామన గౌడను బెడ్ రూమ్ లో అభ్యంతరకర భంగిమలో చూశానని, అదే సమయంలో తన తల్లి నాపై వేడినీళ్లు పోసి శారీరకంగా హింసించిందని, తాను గాయపడినా ఆస్పత్రిలో చేర్పించలేదని బాలిక ఫిర్యాదులో పేర్కొంది.

The mother tortured her daughter who came in while she was in the bedroom with her boyfriend

అక్రమ సంబంధం పెట్టుకుని కన్న కూతురిని చిత్రహింసలకు గురి చేసిన తల్లి మీద, ఆమె ప్రియుడి మీద కేసు నమెదు చేశామని, బాలికను ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించామని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు. ప్రియుడి కోసం కన్న కూతురిని చిత్రహింసలకు గురి చేసిన తల్లిని, ఆమె ప్రియుడు రామన గౌడను కఠినంగా శిక్షించాలని బాలిక తండ్రి వైపు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+