వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఏఎస్ డికే. రవి: రీ పోస్టుమార్టుం చెయ్యాలని?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐఏఎస్ అధికారి డికే రవి మృతదేహానికి రీ పోస్టుమార్టుం చెయ్యాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. డికే. రవి మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసే విషయంపై సీబీఐ అధికారులు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు.

మార్చి 16వ తేదీన డికే రవి అనుమానాస్పదస్థితిలో మరణించారు. మరుసటి రోజు రవి మృతదేహానికి విక్టోరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అదే విధంగా రవి శరీరంలోని కొన్ని భాగాలలో స్యాంపిల్స్ సేకరించి ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. అయితే పోస్టుమార్టం విషయంలో సీబీఐ అధికారులకు పలు అనుమానాలు వచ్చాయి.

సమాధిలో నుండి రవి మృతదేహాన్ని బయటకు తీసి మళ్లీ పోస్టుమార్టం చెయ్యాలని సీబీఐ అధికారులు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. రవి కేసు విషయంలో పలువురు ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. ఈ విషయంపై సీబీఐ అధికారులు జాగ్రతగా వ్యవహరిస్తున్నారు.

దర్యాప్తు చేస్తున్న విషయం బయటకు రాకుండ ఉండాలంటే కట్టుదిట్టమైన భద్రత ఉన్న కార్యాలయం అవసరం అని సీబీఐ అధికారులు అంటున్నారు. చెన్నయ్ సీబీఐ అధికారులకు గంగానగరంలోని బెంగళూరు సీబీఐ కార్యాలయం, సీఓడి కార్యాలయంలో ఒక కార్యాలయం ఎర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది.

dk ravi

అయితే చెన్నయ్ సీబీఐ అధికారులు అందుకు అంగీకరించడం లేదు. ఎంజీ రోడ్డులోని యుటిలిటి బిల్గింగ్ 13వ అంతస్తులో కార్యాలయం ఎర్పాటు చేసుకొవాలని సీబీఐ అధికారులు బావిస్తున్నారు. శుక్రవారం సీబీఐ అధికారి కృష్ణమూర్తి నేతృత్వంలోని బృందం విదాన సౌధకు వెళ్లి హోం శాఖ అధికారులు గగన్ దీప్, వీణా నాగరాజ్ తో చర్చించారు.

రవి మామను విచారించారు, సీసీ కెమెరాలు స్వాధీనం

శుక్రవారం రాత్రి సీబీఐ అధికారులు నాగరబావిలోని రవి మామ హనుమంతరాయప్ప ఇంటికి వెళ్లారు. 20 నిమిషాల పాటు ఆయనను విచారించి వివరాలు సేకరించారు. ఆయన ఇంటిలో ఉన్న సీసీకెమెరాలు, డీవీఆర్ స్వాధీనం చేసున్నారు. ఆ సమయంలో రవి భార్య కుసుమా ఇంటిలోనే ఉన్నారు.

అయితే సీబీఐ అధికారులు కుసుమాను విచారించలేదు. శనివారం మళ్లి హనుమంతరాయప్పను విచారించనున్నారు. ఇప్పటికే రవి కారు డ్రైవర్ ఎళంగోవన్ ను విచారించిన సీబీఐ అధికారులు అతని స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు.

English summary
A meeting of a CBI team was held with the additional secretary home department in connection with the D K Ravi case. The meeting was more of a formality and signals the commencement of the probe into the death of IAS officer D K Ravi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X