Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సుప్రీంకోర్టు జడ్జిగా తెలుగు వ్యక్తి జస్టిస్ భట్..!!

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కేరళ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ వెంకటనారాయణ భట్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయటంతో న్యాయశాఖ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. వీరి నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరనుంది. భూయాన్ 2029 ఆగస్టు1 వరకు, జస్టిస్ భట్ 2027 మే 5 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొనసాగనున్నారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ వెంకటనారాయణ భట్ ఏపీలోని అన్నమయ్య జిల్లా నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగారు. 1962 మే 6వ తేదీన భట్ మదనపల్లెలో జన్మించారు. బెంగళూరులో జగద్గురు రేణుకాచార్య కాలేజ్ నుంచి లా డిగ్రీ పూర్తి చేసి 1987 జనవరి 21న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2013 ఏప్రిల్ 12న ఉమ్మడి ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014 జూన్ 1న ఏపీ - తెలంగాణ ఉమ్మడి హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా హోదా పొందారు. హైకోర్టు విభజన సమయంలో 2019 జనవరి 1న అమరావతిలోని ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

 Justices Ujjal Bhuyan

2019 మార్చి 19న కేరళ హైకోర్టుకు వెళ్లారు. 2029 ఏప్రిల్ 24న అక్కడే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. మే 26న అదే హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఆయన జూన్ 1 నుంచి ఆ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు సుప్రీం కొలీజియం సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయటంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మరో న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ గౌహతిలో 1964 ఆగస్టు 2న జన్మించారు. అంచెలంచలుగా ఎదిగి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగారు. పలు రాష్ట్రాల్లో పని చేసి 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ ప్రమాణం చేసారు. 2022 జూన్ 28న అదే హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పదవీప్రమాణం చేసి ఇప్పటి వరకు సేవలిందస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+