Tomato Price: కిలో రూ.300కు చేరనున్న టమాటా ధర..!
టమాటా ధరలు రాకెట్ కంటే వేగంగా పెరుగుతోన్నాయి. ఇప్పటికే చాలా మంది టమాటా తినడమే బంద్ చేశారు. అయితే టమాటాల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కిలో రూ.150 నుంచి 170 పలికిన కిలో టమాటా ఇప్పుడు రూ.200 పలుకుతోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో కిలో టమాటా రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. ఒకప్పుడు రోడ్డు పై పారబోసిన టమాటా ఇప్పుడు ఆకాశాన్ని తాగడంతో సామాన్యులు చుక్కలు చూస్తున్నారు.
ప్రస్తుతం దాదాపు ఒక్కో టమాటాను రూ. 10 నుంచి రూ.20 కొనుగోలు చేస్తున్నారు. చాలా మంది టమాటా ధరలు నెల, రెండు నెలలు పెరుగుతాయని అంచనా వేశారు. కానీ టమాటా ధరలు తగ్గేలా కనిపించడం లేదు. వర్షాల కారణంగా టమాటా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడి తగ్గడంతో డిమాండ్ భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే టమాటా కిలో రూ.300 లకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

టమాటా, క్యాప్సికం ధరలు భారీగా పెరగడంతో హోల్‌సేల్ వ్యాపారులు నష్టపోతున్నారని వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) సభ్యుడు కౌశిక్ చెప్పారు. హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.160 ఉన్న టమాటా ధరలు ప్రస్తుతం రూ.220కి చేరాయని వివరించారు. ఇక రిటైల్ మార్కెట్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కీలకమైన ఉత్పత్తి ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడిందని చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్‌లో జులైలో భారీ వర్షాలు, పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో అక్కడి నుంచి ఎక్కువగా వచ్చే క్యాప్సికం ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్‌లో టమాటాకు సప్లయ్, డిమాండ్ రెండూ తక్కువగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. టమాటాలు, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయల ధరలు ఎక్కువ ఉండడంతో వాటిని కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపట్లేదవు చెబుతున్నారు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన డేటా ప్రకారం, టమాటా రిటైల్ ధర ఆగస్టు 2న కిలో రూ. 203కి చేరుకుంది
టమాటా పంట రావడానికి 60 నుంచి 70 రోజులు పడుతోంది. అయితే జులై నుంచి రైతులు టమాటా సాగు చేయడం ప్రారంభించారు. అయితే వర్షాల కారణంగా టమాటా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో టమాటా ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications