మసీదులో హరహర మహాదేవ్: భక్తిప్రపత్తులతో పూజలు షురూ
Gyanvapi Mosque: చారిత్రాత్మకమైన వారణాశిలో గల జ్ఞాన్‌వాపి మసీదు వ్యవహారం మరో మలుపు తీసుకుంది. వారణాశిలోని ఈ మసీదులో పూజలను నిర్వహించడానికి హిందువులకు అనుమతి లభించింది. ప్రతి ఒక్క హిందువూ ఇకపై ఈ మసీదులో పూజలు చేసుకోవచ్చు.
మసీదు ఆవరణలో ఉన్న వ్యాస్ కా ఠికానాలో రోజువారీ పూజాదికాలను నిర్వహించుకోవడానికి అవరమైన అనుతులు హిందువులకు లభించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, సుహృద్భావ వాతావరణంలో పూజలు జరుపుకోవడానికి వారం రోజుల్లోగా జిల్లా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లను చేయాల్సి ఉంటుంది.

Recommended Video

ఈ మేరకు బుధవారమే వారణాశి కోర్టు.. అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. ఆదేశాలు వెలువడినప్పటి నుంచీ ఏడు రోజుల్లో ఈ ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేయాలంటూ కోర్టు సూచించినట్లు హిందువుల తరఫు న్యాయవాదలు విష్ణుకుమార్ జైన్, సుభాష్ నందన్ చతుర్వేది తెలిపారు. ఏ ఒక్కరికో పరిమితం కాదని, హిందువులందరూ పూజల్లో పాల్గొనవచ్చని కోర్టు ఆదేశించినట్లు చెప్పారు.
ఏడు రోజుల గడువు ఉన్నప్పటికీ.. ఆదేశాలు వెలువడిన 24 గంటల్లోనే మసీదులో పూజలు మొదలయ్యాయి. కొద్దిసేపటి కిందటే మసీదు బేస్‌మెంట్‌లో హిందు సంప్రదాయాల ప్రకారం.. పూజాదికాలు జరిగాయి. అర్చకులు మహా శివుడికి పూజలు చేశారు. ఘంటానాదాన్ని వినిపించారు. వేదమంత్రోచ్ఛారణలను జపించారు.

దీనికి సంబంధించిన ఓ వీడియో, కొన్ని ఫొటోలను ప్రముఖ న్యాయవాది విష్ణుకుమార్ జైన్.. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. జ్ఞాన్‌వాపి మసీదులో శివాలయం ఉందంటూ హిందూ సంఘాలు ముందు నుంచీ చెబుతూ వస్తోన్న విషయం తెలిసిందే. జ్ఞాన్‌వాపి మసీదులో శివాలయం ఉండేదని, దాన్ని నేలమట్టం చేశారనేది హిందూ ధార్మిక సంఘాల వాదన.
దీనికి సంబంధించిన పలు సాక్ష్యాధారాలను వారు అప్పట్లో న్యాయస్థానానికి సమర్పించారు. ఈ మసీదులో ప్రాచీన శివలింగం, నంది, కోనేరు కూడా ఉన్నాయని వారు వివరించారు. అక్కడ పూజలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలనీ అభ్యర్థించారు. దీనిపై వాదోపవాదాలను విన్న తరువాత వారణాశి కోర్టు.. పూజలకు అనుమతులను ఇచ్చింది.
ఆదేశాలు వెలువడినప్పటి నుంచీ ఏడు రోజుల్లో ఈ ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేయాలంటూ కోర్టు సూచించినట్లు హిందువుల తరఫు న్యాయవాదలు విష్ణుకుమార్ జైన్, సుభాష్ నందన్ చతుర్వేది తెలిపారు. ఏ ఒక్కరికో పరిమితం కాదని, హిందువులందరూ పూజల్లో పాల్గొనవచ్చని కోర్టు ఆదేశించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications