leader: మాజీ ఎంపీ, అధికార పార్టీలో స్టేట్ లీడర్, గుండెపోటు కాదు, కారులోనే హత్య, సీఎం సీరియస్ !

చెన్నై: మాజీ ఎంపీ, అధికార పార్టీలో నామినేటెడ్ పోస్టులో ఉంటున్న ప్రముఖ రాజకీయ నాయకుడు కారులో వెలుతున్న సమయంలో అస్వస్థతకు గురైనారని ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే మాజీ ఎంపీ చనిపోయారని డాక్టర్లు చెప్పారు. అధికార పార్టీ నాయకుడు కావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గుండెపోటుతో ఊపిరిఆడక మాజీ ఎంపీ చనిపోయారని ఆయన బంధువు అందరికీ చెప్పాడు. పోస్టుమార్టం నివేదికలో కలకలం రేపే విషయాలు వెలుగు చూశాయి. అధికార పార్టీకి చెందిన మాజీ ఎంపీకి గుండెపోటు రాలేదని, ఆయన్ను హత్య చేశారని వెలుగు చూడటంతో ఆ పార్టీ నాయకులు హడలిపోయారు.

అధికార పార్టీ లీడర్

అధికార పార్టీ లీడర్

డిసెంబరు 21వ తేదీన తమిళనాడు మాజీ ఎంపీ డాక్టర్ మస్తాన్ తన బంధువు, కారు డ్రైవర్ అయిన ఇమ్రాన్‌తో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో మస్తాన్‌కు అకస్మాత్తుగా అస్వస్థత వచ్చిందని, ఛాతిలో నొప్పి వచ్చిందని మస్తాన్‌ని గుడువంచెరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇమ్రాన్ చేర్పించారు. అయితే మస్తాన్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

రాయ్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ?

రాయ్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ?

ఈ సమాచారం తెలుసుకున్న చెన్నై సిటీ పోలీసులు మాజీ ఎంపీ మస్తాన్ మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెన్నై సిటీలోని రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మాజీ ఎంపీ మస్తాన్ మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పగించి అంత్యక్రియలు నిర్వహించారు.

మాజీ ఎంపీ కేసులో ట్విస్ట్

మాజీ ఎంపీ కేసులో ట్విస్ట్

తమిళనాడు మాజీ ఎంపీ, డీఎంకే నాయకుడు మస్తాన్ మృతి కేసు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. మస్తాన్‌ను ఆస్పత్రిలో చేర్పించిన బంధువు ఇమ్రాన్‌ అతని అనుచరులతో కలిసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మాజీ ఎంపీ మస్తాన్ సోదరుడికి ఇమ్రాన్ అల్లుడు అవుతాడు. డబ్బుల విషయంలో మస్తాన్, ఇమ్రాన్ మధ్య కొంతకాలం క్రితం వాగ్వాదం జరిగిందని వెలుగు చూసింది.

లక్షల్లో అప్పు తీసుకున్నాడు

లక్షల్లో అప్పు తీసుకున్నాడు

మస్తాన్ బ్యాంకు అకౌంట్ నుంచి ఇమ్రాన్‌కు రూ. 8.50 లక్షల రూపాయలు అప్పుగా వెళ్లిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మాజీ ఎంపీ మస్తాన్ దగ్గర ఆయన బంధువు ఇమ్రాన్ కొన్ని లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడు. ఇదే విషయంలో వారి మధ్య గొడవలున్నట్లు బంధువుల ద్వారా పోలీసులకు తెలిసింది.

ఫ్రెండ్స్ తో మాజీ ఎంపీ హత్యకు స్కెచ్

ఫ్రెండ్స్ తో మాజీ ఎంపీ హత్యకు స్కెచ్

పోస్ట్‌మార్టం నివేదికలో మాజీ ఎంపీ మస్తాన్ ఊపిరాడక మృతి చెందినట్లు నిర్ధారించారు. ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఊపిరాడక మస్తాన్ మృతి చెందిఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. చెన్నై పోలీసులు ఇమ్రాన్‌ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీసి సీరియస్‌గా విచారణ చేపట్టారు. ఇదే సమయంలో ఇమ్రాన్ సెల్‌ఫోన్‌ను పోలీసులు పరిశీలించారు. మాజీ ఎంపీ మస్తాన్‌ను హత్య చేసేందుకు ఇమ్రాన్ నలుగురితో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.

మాజీ ఎంపీని కారులోనే చంపేశారు

మాజీ ఎంపీని కారులోనే చంపేశారు

మాజీ ఎంపీ మస్తాన్‌ను ఆయన కారులోనే దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మస్తాన్ కాళ్లు, చేతులు పట్టుకుని ముఖం, నోరు బిగించి ఊపిరి రాకుండా చేసి హత్య చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది, మాజీ ఎంపీ మస్తాన్ హత్య కేసులో ఇమ్రాన్ తో సహ నలుగురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీకి చెందిన మాజీ ఎంపీ, తమిళనాడు డీఎంకే మైనారిటీ సెల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మస్తాన్ హత్యకు గురికావడం తమిళనాడులో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+