లవ్ మ్యారేజ్ లో క్యాస్ట్ ఫీలింగ్, మా కులం పరువు తీశావు కదరా కుక్క?, మ్యాటర్!

ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడికి చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉండటంతో స్నేహితులు అయ్యారు. రానురాను స్నేహితులు ప్రేమికులు అయ్యారు. కులాలు వేరు అయినా పెద్దలను ఎదిరించి ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకుని ఓ బాబుకు తల్లిదండ్రులు అయ్యారు. పెద్దలు రాజీ అయినా అబ్బాయి వైపు బంధువులు మాత్రం మా కులం పరువు తీశారని ఆ దంపతుల పాలిట విలన్లు అయ్యారు.

తక్కువ కులానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నందుకు ఓ యువకుడిని ఇంట్లో నుంచి బయటకు లాగి ఆ యువకుడి కులస్తులు అతన్ని నగ్నం చేసి చితకబాదిన సంఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా తరికెరె తాలూకా కళ్లట్టిగిరి గ్రామంలో చోటుచేసుకుంది. అబ్బాయి ఓ అగ్రకులానికి చెందినవాడు, అమ్మాయి ఎస్టీ కమ్యూనిటీకి చెందినది. చాలా సంవత్సరాల పాటు యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న ప్రేమికులు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

The relatives of the youth who crushed the boy friend naked for defaming the caste by marrying intercaste

ఇద్దరు కులాలకు అతీతంగా ప్రేమించుకున్నారని వారి కుటుంబ సభ్యులకు తెలిసింది. ఇరువైపుల కుటుంబ సభ్యులను ఒప్పించిన ప్రేమికులు 2021మార్చి 24వ తేదీన కుటుంబ సభ్యులు, అమ్మాయి బంధువుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి అబ్బాయి బంధువులు ఎవ్వరూ హాజరుకాలేదు. ఈ పెళ్లి విషయంలో అబ్బాయి వైపు కులపెద్దలు, బంధువులు, కుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకుని మా కులం పరువు తీశారంటూ యువకుడిపై దాడికి పాల్పడ్డారు.

అప్పటి నుంచి ప్రియుడి వైపు బంధువులు అతని శారీరకంగా, మానసికంగా టార్చర్ పెడుతున్నారని తెలిసింది. ప్రేమ వివాహం చేసుకున్న దంపతులకు ఓ బాబు పుట్టాడు. గత ఏడాది అబ్బాయిని అతని కులం నుంచి వెలివేస్తూ అతనికి ఏ విధంగా సహకరించకూడదని ఆ కులం పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. అబ్బాయి సొంత చిన్నాన వాళ్ల పాలిట విలన్ అయ్యాడు. సొంత అన్న కొడుకు తక్కువ జాతి అమ్మాయిని పెళ్లి చేసుకుని మా కులంలో మా కుటుంబం తల దించుకునే పని చేశాడని అతని చిన్నాన పగ పెంచుకున్నాడు.

సమయం చిక్కినప్పుడు అన్న కొడుకు, అతని భార్యకు బుద్ది చెప్పాలని, వాళ్లను ఊరి నుండి తరిమికొట్టాలని ప్లాన్ చేశాడు. ఇదే ఏడాది జనవరి 24వ తేదీ అర్దరాత్రి అబ్బాయి కులం వైపు యువకులు లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆ యువకుడి ఇంట్లోకి చొరబడి నీ వల్ల మా కుల పరువు పోయింది అంటూ ఆ యువకుడిని ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకెళ్లి అతని బట్టలు చింపేసి అతని మీద దారుణంగా దాడి చేశారు.

మా కులం అబ్బాయిని పెళ్లి చేసుకుని మా పరువు తీస్తావా ? అంటూ ప్రేమ వివాహం చేసుకున్న మహిళ మీద ఆ యువకుడి బంధువులు, అతని కులానికి చెందిన యువకులు దాడి చేశారు. మర్యాదగా ఊరు వదిలి వెళ్లకపోతే మీ అంతు చూస్తామని బెదిరించిన యువకుడి చిన్నాన, అతని బంధువులు బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. 2021 నుంచి ఈ జంటను యువకుడి కులస్తులు మానసికంగా వేధిస్తున్నారని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ప్రేమ వివాహం చేసుకున్న జంటకు చిన్నాన, మామ విలన్లుగా మారారు ఆ ఊరిలోని కొందరు ఆరోపించారు. ఆ దంపతులను ఊరి నుంచి నుంచి వెళ్లగొట్టాలని యువకుడి చిన్నాన ప్లాన్ చేశాడని గ్రామస్తులు అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని. దంపతులకు రక్షణ కల్పించాలని, దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయాలని గ్రామంలోని యువతి బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు ఫిర్యాదు చేశారని, దర్యాప్తు చేస్తున్నామని చిక్కమగళూరు పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+