lady: లిఫ్ట్ లో పనిమనిషిని చితకబాది బయటకు ఈడ్చేసింది, యువతి మీద దాడి వీడియోలు వైరల్ !

నోయిడా/న్యూఢిల్లీ: కొన్ని రోజుల క్రితం నోయిడాలోని ఓ అపార్ట్ మెంట్ లో తన గుర్తింపు కార్డు అడిగినందుకు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ సెక్యూరిటీ గార్డును ఓ వ్యక్తి కొట్టాడు. ఈ ఘటన మరువకముందే నోయిడాలో మరో దాడి వీడియో వెలుగులోకి వచ్చింది. నోయిడా హౌసింగ్ సొసైటీలోని లిఫ్ట్‌లో ఇంటి పని చేసే యువతి మీద ఓ మహిళ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేశారు. ఈ ఘటన అపార్ట్ మెంట్ లిఫ్ట్‌లోని సీసీటీవీలో రికార్డు అయ్యింది.

అపార్ట్ మెంట్ లో పనిమనిషి

హౌసింగ్ సొసైటీ నివాసి షైఫాలీ కౌల్ అనే మహిళ 20 ఏళ్ల ఇంటి పనిమనిషి మీద దాడి చేసి ఆమెను లిఫ్ట్ నుండి బయటకు ఈడ్చేసింది. నోయిడాలోని సెక్టార్ 120లోని క్లియో కౌంటీ హౌసింగ్ సొసైటీలో ఈ దారుణం చోటుచేసుకుంది. నోయిడాలోని సెక్టార్ 120లోని క్లియో కౌంటీ సొసైటీకి చెందిన షైఫాలీ కౌల్ అనే మహిళ ఆమె ఇంటిలో పని చెయ్యడానికి 20 ఏళ్ల అనిత అనే యువతిని ఇంటి పనిమనిషిగా పెట్టుకుంది.

టార్చర్ తట్టుకోలేక ?

ఇటీవల ఇంటి యజమాని షైఫాలి కౌర్ నిరంతరం వేధించడంతో అనిత అక్కడ పనిమానేసి ఆమె స్వగ్రామానికి వెళ్లిపోవాలని ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఇంటి పనిమనిషి అనితపై ఇంటి యజమాని కౌర్ దాడి చేసింది. దాడికి గురైన అనిత గత ఆరు నెలలుగా షైఫాలీ కౌర్ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తోంది.

నా ఇంట్లో పనిమానేస్తావా ?

నా ఇంట్లో పనిమానేస్తావా ?

తన ఇంటిలో పని మానేస్తున్న అనితా వేరే చోట పని చెయ్యడానికి వెలుతోందని కౌర్ అనుమానం పెంచుకుంది. ఇంటి యజమాని షైఫాలీ కౌర్ రోజూ అనితా మీద దాడి చేసి ఆమెను శారీరకంగా హింసించిందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అనితా మీద దాడికి సంబంధించిన వీడియో బయటకురావడంతో షైఫాలీ కౌర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గౌతమ్ బుద్ధనగర్ పోలీస్ స్టేషన్‌లో శాడిస్టు మహిళ కైర్ మీద కేసు నమోదైంది.

లిఫ్ట్ లో సీసీటీవీ కెమెరాల్లో ?

లిఫ్ట్ లో సీసీటీవీ కెమెరాల్లో ?

గౌతమ్ బుద్ధ నగర్ కమిషనరేట్ అధికారిక ట్విట్టర్ పేజీ ద్వారా కౌర్ మీద కేసు నమోదు చేశామని ట్వీట్ చేశారు. బాధితురాలి తండ్రి అందించిన సమాచారం మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, యువతిపై దాడి చేసిన కేసుకు సంబంధించి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఇంటి పనిమనిషి అనితా మీద దాడి చేసిన వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+