వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తరుముకొస్తున్న కరోనా రెండో దశ.!సమీపిస్తున్న దీపావళి.!ఆందోళన రేపుతున్న టపాకాయల కాలుష్యం.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కోవిడ్-19 రెండో దశ యూరప్ దేశాలను వణికిస్తోంది. అందుకు తగ్గట్టే రెండో దశ లాక్‌డౌన్ దిశాగా ప్రపంచ దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక భారతదేశం లో కరోనా మహమ్మారి రెండోసారి విజృంభిస్తే పరిస్థితులు దారుణంగా పరిణమించే అవకాశాలు ఉన్నట్టు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో పరిసరాల ద్వారా ఎక్కువా వ్యాపించే కరోనా వైరస్ కు వాయు కాలుష్యం తోడైతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందనే చర్చ జరుగుతోంది. రాబోవు దీపావళి పర్వదినం సందర్బంగా కాల్చే టపాకాలయ కాలుష్యం కరోనా విస్థరణకు ఎంతవరకు దోహదం చేస్తుందనే అంశంపై లోతైన చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Recommended Video

Corona Virus Second Wave : Cases May Increase During Diwali, Says Experts | Oneindia Telugu
వణికిస్తున్న రెండోదశ కరోనా.. భయపెడుతున్న దీపావళి కాలుష్యం..

వణికిస్తున్న రెండోదశ కరోనా.. భయపెడుతున్న దీపావళి కాలుష్యం..

భారతదేశంలో అన్ని పర్వదినాలపై కరోనా వైరస్ ప్రభావం చూపినట్టే దీపావళి పండుగపైన కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్, డిసెంబర్, జనవరి మూడు నెలల పాటు కరోనా వైరస్ రెండోసారి విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని అమెరికాలోని ప్రముఖ ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం వైద్య నిపుణులు ప్రపంచ మానవాళిని హెచ్చరిస్తున్నారు. కరోనా రెండోదశ అత్యంత ప్రమాదకరంగా ఉండడమే కాకుండా ఊహించని సంఖ్యలో ప్రాణ హాని ఉండే అవకాశలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.

రెండోదశ అత్యంత ప్రమాదరకం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..

రెండోదశ అత్యంత ప్రమాదరకం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..

దానికి తోడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా రెండో దశ పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా వైరస్ వ్యాక్సీన్ పట్ల ప్రయోగాలు ఇంకా పూర్తికాని సందర్బంలో రెండో సారి విజృంభణ అత్యంత ప్రమాద ఘంటికలను మోగించే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలనిస్తోంది. దీంతో పర్యావరణాన్ని రక్షించుకుంటూనే కోవిడ్ నిర్మూలన మార్గాలకు కట్టుబడి ఉండాలనే ముందస్తు జాగ్రత్తలను ఉపదేశిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇదే క్రమంలో వాయు కాలుష్యంపై అప్రమత్తంగా ఉండాలనే సూచనలను కూడా చేస్తోంది.

దీపావళి టపాకాయల కాలుష్యం.. ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజానికం..

దీపావళి టపాకాయల కాలుష్యం.. ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజానికం..

కరోనా రెండో దశ విజృంభణ పట్ల యూరప్ దేశాలు ముందుచూపుతో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఫ్రాన్స్ ఇప్పటికే రెండు వారాల లాక్‌డౌన్ ను ప్రకటించింది. జర్మనీ నాలుగు వారాల లాక్‌డౌన్ ఉత్తర్వులను ఆదేశించింది. లాక్‌డౌన్ విధించే దిశగా ఇటలీ కూడా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రెండో దశ అత్యంత ప్రమాదకరంగా ఉండే అవకాశాలు ఉన్నందును ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ప్రపంచ దేశాలు. గతంలో 1917 నుండి 1919వరకు స్పెయిన్ లో సంభవించిన రెండవ దశ విష పూరిత ఫ్లూ వల్ల మొదటి దశలో సంభవించిన మరణాలకంటే మూడింతల మరణాలు ఎక్కువగా సంభవించాయని తెలుస్తోంది. దీంతో రెండోదశ కరోనా పట్ల ఆందోళన రెట్టింపవుతోంది.

భారత్ లో కరోనా మరోపారి విరుచుకుపడే అవకాశం.. టపాకాయలపై మార్గదర్శకాలు విడుదల చేయాలంటున్న ప్రజలు..

భారత్ లో కరోనా మరోపారి విరుచుకుపడే అవకాశం.. టపాకాయలపై మార్గదర్శకాలు విడుదల చేయాలంటున్న ప్రజలు..

ఇక ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటీవ్ కేసులు స్థిరంగా ఉన్నప్పటికి మరికొన్ని రాష్ట్రాల్లో తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా విజృంభణకు తోడు దీపావళి పర్వదినం సందర్బంగా కాల్చే టపాకాయల కాలుష్యం కూడా కరోనా విస్తరణకు దోహదం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ ఊపిరి తిత్తుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంటే, టపాకాయల ద్వారా వచ్చే పొగ ఊపిరి తిత్తులను మరింత కోలుకోకుండా చేస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులు కూడా టపాకాయల వల్ల వ్యాపించే కాలుష్యం వల్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీపావళి సందర్బంగా కాల్చే టపాయాల పట్ల వాతావరణ శాఖ గాని, ప్రభుత్వం గాని స్పష్టమైన నిబంధనలు జారీ చేయాలనే అభిప్రాయాలు ప్రజలను నుండి వ్యక్తమవుతున్నాయి.

English summary
There seems to be an in-depth discussion on the extent to which incineration pollution contributes to corona expansion during the upcoming Diwali festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X