మెట్రో రైలులో తిక్క చేష్టలు, ఉపేంద్ర పాటకు రీల్స్, సీసీటీవీల్లో ?, ఎక్కడ చూసినా ఇదే !
ఇటీవల బెంగుళూరు నమ్మ మెట్రో ఏదో ఒక రంగా వార్తల్లో నిలుస్తోంది. ప్రయాణికులు నమ్మ మెట్రోలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బీఎంఆర్‌సీఎల్ కొన్ని కఠినమైన నిబంధనలను జారీ చేసింది. అంతే కాకుండా కొందరు ప్రయాణికులు ఈ నిబంధనలను ఉల్లంఘించిన సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. మళ్లీ అలాంటి ఘటనే నమ్మ బెంగళూ మెట్రో రైలులో చోటుచేసుకుంది.
కర్ణాటకలో ఇప్పుడు ఎక్కడ చూసినా, కన్నడ బాష గురించి తెలిసిన వాళ్లు చూస్తున్న విపరీతమైన వైరల్ వీడియో కరిమణి మాలిక నానల్లా అనే సాంగ్ రీల్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'కరిమణి మాలిక నానల్లా.. నానల్లా' పాట బాగా ట్రెండ్ అవుతోంది. చిన్న పిల్లలతో పాటు ముసలోళ్ల నోళ్లలోనూ ఈ పాట వినిపిస్తోంది. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో ఈ పాట మరింత ఫేమస్ అవుతోంది.

అయితే బెంగళూరులోని నమ్మ మెట్రో రైలులో ఇదే పాటకు రీల్స్ తయారు చేసి యువకులు వెర్రిగా కేరింతలు కొట్టి తిక్క చేష్టలు చేసి ఇతర ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బీఎంఆర్ సీఎల్ నియమాల ప్రకారం మెట్రోలో ఎలాంటి రీల్స్ చేయరాదు. లోపల రీల్స్ తో పాటు సాటి ప్రయాణికుల ఫోటోలు, వీడియోలు కూడా తియ్యకూడదు.
ఇలా చేస్తే వృద్ధులు చిన్న పిల్లలను ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ బెంగళూరులోని నమ్మ మెట్రో రైలులో కరిమణి మాలిక నానల్లా పాట పాడుతూ అరుస్తున్న యువకుల బృందం ఈ నిబంధనను గాలికి వదిలేసింది ఇది చివరికి సాటి ప్రయాణికులకు చికాకు కలిగించే విధంగా తయారైయ్యిందని వెలుగు చూసింది. మెట్రో రైలులో రీల్స్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Crazy scene's in @OfficialBMRCL 😂🔥
— ದರ್ಶನ್ ಎ KAATERA💥🗡️ (@DarshanBoss05) March 4, 2024
And yes @RCBTweets won 🥵❤️🔥#RCBvUPW pic.twitter.com/o9CF6jDQOH
ఇప్పుడు బెంగళూరులోని నమ్మ మెట్రోలో యువత రీల్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. మెట్రో రైలు ప్రయాణికులు బీఎంఆర్ సీఎల్ ని ట్యాగ్ చేసి ట్వీట్ల ద్వారా రీల్స్ చేసిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటన ఏ మార్గంలో జరిగిందన్న సమాచారం తెలియాల్సి ఉందన మెట్రో అధికారులు అంటున్నారు. నమ్మ మెట్రో రైలులోని వీడియో క్లిప్పింగ్స్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, నిందితుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని మెట్రో అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications