Supreme Court: గర్భవిచ్చిత్తిపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

గర్భవిచ్చిత్తిపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 14 ఏళ్ల అత్యాచార బాధితురాలి 30 వారాల గర్భాన్ని తక్షణమే తొలగించాలని సోమవారం ఆదేశించింది. వైద్యపరంగానే గర్భవిచ్చిత్తి చేయాలని స్పష్టం చేసింది. బాలిక గర్భవిచ్చిత్తిపై మహారాష్ట్ర హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముంబయిలోని సియోన్ ఆసుపత్రిలో గర్భవిచ్చిత్తికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

మైనర్‌ను సురక్షితంగా వైద్యసదుపయాలు కల్పించాలని.. ఆ ఖర్చులను మహారాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరించిందని బెంచ్ ఆసుపత్రిని స్పష్టం చేసింది. బాలిక ఫిబ్రవరి 2023లో తప్పిపోయిందని బాదితురాలి తల్లి తెలిపింది. మూడు నెలల తర్వాత రాజస్థాన్‌లో ఒక వ్యక్తి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పింది. బాలికపై లైంగిక దాడి చేసిన నిందితులపై పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే బాలిక గర్భవతి అని చాలా ఆలస్యం తెలసినట్లు చెప్పారు. దీంతే 28 వారాల సమయంలో బాలిక గర్భవిచ్చిత్తికి అనుమతి ఇవ్వాలని బాలిక తల్లి మహారాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.

The Supreme Court announced a sensational verdict on the girl s abortion

కేసు విచారించిన హైకోర్టు బాలిక గర్భవిచ్చిత్తికి నిరాకరించింది. ఈ దశలో పిండం శిశువుగా మారుతుందని.. ఈ సమయంలో గర్భం తొలగించాలని ఆదేశించలేమని స్పష్టం చేసింది. మహారాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని సవాల్ చేస్తూ అత్యాచార బాధితురాలి తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కేసు విచారణ చేపట్టిన సుప్రీం బాలిక ఆరోగ్య విషయమై నివేదిక ఇవ్వాలని ముంబైలోని సియోన్ ఆస్పత్రిని ఆదేశించింది. మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని, దాని నివేదికను తదుపరి విచారణ తేదీ ఏప్రిల్ 22న కోర్టు ముందు ఉంచాలని బెంచ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.

బాలికకు అన్ని పరీక్షలు చేసి సుప్రీంకు నివేదిక సమర్పించారు. ఈ సమయంలో బాలికకు గర్భం తొలగిస్తే ఇబ్బందేనని నివేదికలో పేర్కొన్నారు. అయితే బాలిక ప్రసవించిన తర్వాత ఇంకా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని వివరించింది. అందుకే గర్భం తొలగించడమే ఉత్తమమని పేర్కొంది. నివేదిక పరిశీలించిన సుప్రీం కోర్టు బాలికకు గర్భం తొలగించాలని తీర్పు వెల్లడించింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) చట్టం ప్రకారం, వివాహిత స్త్రీలతో పాటు అత్యాచారం బాధితులతో సహా ప్రత్యేక కేటగిరీలలో ఉన్నవారికి, ప్రత్యేక వికలాంగులు, మైనర్‌లు వంటి ఇతర బలహీన మహిళలకు గర్భం తొలగించడానికి గరిష్ట పరిమితి 24 వారాలుగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+