Suprem Court: క్షమాభిక్ష పిటిషన్ల జాప్యంపై సుప్రీం కోర్టు అసహనం..

క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం చేయడంపై సుప్రీం కోర్టు స్పందించింది. ఈ జాప్యం మరణ శిక్ష పడిన ఖైదీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని అభిప్రాయపడింది. క్షమాభిక్ష పిటిషన్లపై సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేసింది. ఓ కేసులో అక్కాచెల్లెళ్లకు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా తగ్గిస్తూ బాంబే హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎంఆర్ షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది.

ఆయా మరణ శిక్ష కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించిన తర్వాత కూడా.. నేరస్థుల క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ధర్మాసనం తెలిపింది. దీంతో మరణశిక్ష ఉద్దేశం మారిపోతుందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో క్షమాభిక్ష పిటిషన్లను వీలైనంత త్వరగా పరిష్కరించాలని స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని కోల్హాపూర్‌లో 13 మంది పిల్లలను కిడ్నాప్ చేసి, వారిలో తొమ్మిది మందిని హత్య చేసిన కేసులో 2001లో స్థానిక కోర్టు ఓ మహిళ, ఆమె సోదరికి మరణ శిక్ష విధించింది.

 Suprem Court:

ఈ తీర్పును 2004లో హైకోర్టు, 2006లో సుప్రీం కోర్టు సమర్థించాయి. అయితే వారి క్షమాభిక్ష పిటిషన్లు దాదాపు ఏడేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై తుది నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్రం/ గవర్నర్‌ తీవ్ర జాప్యం కారణంగా.. బాంబే హైకోర్టు వారి మరణశిక్షను జీవిత ఖైదుగా తగ్గించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తు మహారాష్ట్ర సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు.

మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చే విషయంలో క్షమాభిక్ష పిటిషన్ల పరిష్కారంలో తీవ్ర జాప్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది. మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చే సమయంలో నేరం తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటారనేది వాస్తవమేనని, అయితే క్షమాభిక్ష పిటిషన్ల పరిష్కారంలో విపరీతమైన జాప్యం కూడా జరుగుతుందని న్యాయమూర్తులు ఎంఆర్ షా, సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. జగదీష్ వి. మధ్యప్రదేశ్, ఈ కోర్టు ఐదేళ్లకు పైగా క్షమాభిక్ష పిటిషన్‌ను పరిష్కరించడంలో జాప్యాన్ని పరిగణనలోకి తీసుకొని మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని ఆదేశించింది. మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చే ఇతర నిర్ణయాలను కూడా ఉదహరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+