మణిపూర్ ఎఫెక్ట్, లేడీ లాయర్ అరెస్టుకు బ్రేక్ వేసిన సుప్రీం కోర్టు, ఏం జరిగిందంటే!
ఇంపాల్/మణిపూర్: మణిపూర్ లో సుమారు రెండు నెలల నుంచి హింస చెలరేగుతున్న విషయం తెలిసిందే. మణిపూర్ లో హింస కారణంగా ఇప్పటికే వంద మందికి పైగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మణిపూర్ లో రెండు కులాలకు సంబంధించిన గొడవల్లో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. మణిపూర్ లో ఇప్పటి వరకు పరిస్థితులు అదుపులోకి రాలేదు.
భార్యను చంపేసి ఆమె తెలివైన మెదడు, మాంసం తినేసిన భర్త, మ్యాటర్ మాత్రం!
ఇప్పటికే ఆర్మీ బలగాలు రంగంలోకి దిగినా హింసను అరికట్టడానికి నానా తంటాలు పడుతున్నాయి. రెండు కులాలకు చెందిన వ్యక్తులు ఆయుధాలు చేతపట్టుకోవడం, మహిళలు రంగంలోకి దిగడంతో పరిస్థితులు విషమించాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కుకీ కులస్తులతో రాజీ చర్చలు జరిపి మణిపూర్ లో హింసను అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నది.

ఢిల్లీకి చెందిన కమ్యూనిస్టు పార్టీ లేడీ లాయర్ దీక్షా దివ్వేదితో పాటు మరో నలుగురు మణిపూర్ లో హింస చల్లారిందా లేదా, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మణిపూర్ లో మహిళలకు రక్షణ ఉందా, లేదా ? అని సమాచారం సేకరించడానికి నాలుగు రోజుల పాటు మణిపూర్ లో పర్యటించారు. మణిపూర్ లో హింస ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లేడీ లాయర్ దీక్షా ద్వివేది అండ్ టీమ్ పర్యటించారని తెలిసింది.
ఆ సమయంలో నియమాలు ఉల్లంఘించిన లేడీ లాయర్ దీక్షా దివ్వేది. ఆమె టీమ్ మణిపూర్ లో పర్యటించారని అక్కడి పోలీసులు ఆమెతో పాటు ఆమె టీమ్ మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశారు. తన మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చెయ్యాలని, తనను అరెస్టు చెయ్యకుండా ఆదేశాలు ఇవ్వాలని లేడీ లాయర్ దీక్షా దివ్వేది సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

మంగళవారం సుప్రీం కోర్టులో లేడీ లాయర్ సమర్పించిన పిటిషన్ విచారణకు వచ్చింది. లేడీ లాయర్ మీద బలవంతపు చర్యలు తీసుకోకూడదని, ఏం జరిగిందో పూర్తి సమాచారం కోర్టు ముందు సమర్పించాలని సుప్రీం కోర్టు మణిపూర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. లేడీ లాయర్ దీక్షా దివ్వేది నియమాలు ఉల్లంఘించి పర్యటిస్తున్నారని ఆరోపిస్తూ స్థానికంగా నివాసం ఉంటున్న లిబెన్ సింగ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆమె మీద పోలీసులు కేసు నమోదు చేశారని ఆమె తరపు న్యాయవాది అంటున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications