Viral Video: ఊ అంటావా పాటకు కిర్రాక్ స్టెప్పులేసిన మహిళలు.. చూస్తే మతిపోవాల్సిందే..
పుష్ప సినిమా దక్షిణాదితోపాటు బాలీవుడ్ లో కూడా విజయం సాధించింది. పుష్ప సినిమాలోని పాటలకు సెలబ్రెటీలు, క్రీడాకారులు స్టెప్పులేసిన వీడియోలో అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే పుష్ప సినిమా ఫీవర్ ఇంకా కొనసాగుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్టయింది.

9 నెలలు గడిచినా
ఈ సినిమా విడుదలై 9 నెలలు గడిచినా క్రేజ్ తగ్గడం లేదు. భారతదేశంతోపాటు విదేశాలలో సోషల్ మీడియాను పుష్ప పాటలు ఊపెస్తున్నాయి. ఈ సినిమాలోని పాటలపై డ్యాన్స్ రీల్స్ చేయడం, అల్లు అర్జున్ డైలాగ్‌లకు లిప్ సింక్ చేయడం చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ వివాహ వేడుకలో చీర కట్టుకున్న మహిళల బృందం బెల్లీ ఈ సినిమాలోని ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించింది.

కిర్రాక్ స్టెప్పులు
ముగ్గురు మహిళలు సమంతా డ్యాన్స్ చేసిన ఊ అంటావా పాటకు కిర్రాక్ స్టెప్పులేశారు. మధ్యలో ఉన్న మహిళ ఎరుపు రంగు చీర కట్టుకోగా, మరో ఇద్దరు మహిళలు నారింజ రంగు చీర కట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు 7వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ మహిళలు ఊ అంటావా తర్వాత, మహిళలు రెండో పాటకు కూడా డ్యాన్స్ చేశారు.
టిప్ టిప్ బర్సా పానీ
అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ నటించిన టిప్ టిప్ బర్సా పానీ పాటకు స్టెప్పులేశారు. వీరిని అక్కడున్నవారు ఎంకరేజ్ చేశారు. ఈ వీడయోపై నెటిజన్లు డిఫరెంట్ గా స్పందంచారు.












Click it and Unblock the Notifications