Donald Trump వీసా బాంబ్:మారిన పెళ్లిళ్ల ట్రెండ్-వారిపై తగ్గిన మోజు..!!
అమెరికన్ వీసాల విషయంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఇప్పుడు భారతీయ వివాహాల మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా H-1B వీసా ఫీజును లక్ష డాలర్లకు (దాదాపు ₹88 లక్షలకు) పెంచాలన్న ఆయన ప్రకటనతో అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయ యువత, వారి తల్లిదండ్రుల్లో పెద్ద కలవరం మొదలైంది. ఒకప్పుడు NRI అల్లుడు దొరికితే తమ పిల్లల భవిష్యత్తు సురక్షితమని భావించిన భారతీయ కుటుంబాలు, ఇప్పుడు తమ నిర్ణయాలను మార్చుకుంటున్నాయి.
NRIల డిమాండ్ ఎందుకు తగ్గుతోంది..?
H-1B వీసా అనేది టెక్నాలజీ, ఇంజినీరింగ్, వైద్యం వంటి రంగాల్లో విదేశీ నిపుణులను నియమించుకోవడానికి అమెరికన్ కంపెనీలకు ఇచ్చే నాన్-రెసిడెన్షియల్ వీసా. ఈ వీసాదారుల్లో 71% మంది భారతీయులే ఉండటం వల్ల ట్రంప్ ప్రకటన భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి ఈ భారీ ఫీజు వర్తిస్తుందని వైట్ హౌస్ వివరణ ఇచ్చినా, అమెరికాలో ఉద్యోగం, వీసాపై ఏ క్షణంలో ఎలాంటి ప్రభావం పడుతుందోనన్న అభద్రతా భావం భారతీయ కుటుంబాల్లో పెరిగింది.

రాయిటర్స్ నివేదికల ప్రకారం, దేశీయ మ్యాట్రిమోనీలు,పెళ్లిళ్ల బ్రోకర్లు కూడా ఈ మార్పును గమనిస్తున్నారు. గతంలో ఆర్థిక భద్రతకు భరోసాగా నిలిచిన అమెరికా NRIలతో పెళ్లి సంబంధాలు చేసుకోవడానికి తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు.ట్రంప్ పేల్చిన H-1B వీసా బాంబుతో అమెరికాలో సెటిల్ అవ్వాలన్న తమ కల ఇక కష్టమని భావించి యువత ప్లాన్ మార్చుకుంటోంది.
మ్యారేజ్ మ్యాట్రిమోనీల కొత్త ట్రెండ్
కొంతకాలం క్రితం వరకు విదేశీ అల్లుళ్ల కోసం విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ట్రంప్ విధానాల వల్ల చాలా కుటుంబాలు విదేశీ సంబంధాలను వాయిదా వేస్తున్నాయి. పరిస్థితిని అర్థం చేసుకున్న కొన్ని మ్యాట్రిమోని కంపెనీలు కూడా తమ పద్ధతులు మార్చుకున్నాయి. ప్రీమియం మ్యాచ్‌మేకింగ్ యాప్‌లు అయితే,వీసా ఫిల్టర్‌ను అందుబాటులోకి తెచ్చాయి. దీని ద్వారా కుటుంబాలు తమకు కాబోయే భాగస్వామి యొక్క వీసా స్టేటస్‌ను ముందే తెలుసుకునే అవకాశం కలిగింది.
ప్రపంచంలోనే అత్యంత పెద్ద సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు. సుమారు 21 లక్షల మంది భారతీయులు అక్కడ నివాసం ఉంటున్నారు.ట్రంప్ నిర్ణయాల వల్ల వారి ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారడంతో.. వివాహ మార్కెట్‌లో NRIల వైపు మొగ్గు తగ్గుముఖం పట్టడం విశేషం.
-
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications