లిప్ లాక్, హగ్ కోసం: తట్టుకోలేక బెంగళూరు పరువు తీశారు
బెంగళూరులో డిసెంబర్ 31 అర్దరాత్రి యువతిని వేదింపులకు గురి చేసి ఇంత రాద్దాంతానికి అసలు కారణం ఓ లిప్ లాక్, హగ్ అని పోలీసులు అంటున్నారు.
బెంగళూరు: బెంగళూరులోని కమ్మనహళ్లి ప్రాంతంలో డిసెంబర్ 31 అర్దరాత్రి యువతిని వేదించిన నిందితులు అసలు విషయం చెప్పడంతో పోలీసులు షాక్ కు గురైనారు. దేశం మొత్తం దృష్టిసారించిన ఈ రాద్దాంతానికి అసలు కారణం ఓ లిప్ లాక్, హగ్ అని నిందితులు అంగీకరించారని పోలీసులు అంటున్నారు.
ఆ యువతి అందాన్ని చూసి, వ్యామోహంతో తట్టుకోలేక తాను ఈ పని చేశానని రామమూర్తినగర పోలీసుల ముందు నిందితుడు లెనిన్ అలియాస్ లినో నేరం అంగీకరించాడు. శుక్రవారం నిందితులను బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కార్యాలయానికి తీసుకు వెళ్లారు.
ప్రముఖ నిందితుడు లింగరాజపురం నివాసి లెలిన్ అలియాస్ లినో (23) బీకాం చదువుతూ సిటి సెంటర్ లో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. అయ్యప్ప అనే నిందితుడు డ్రైవర్. కమ్మనహళ్ళిలో నివాసం ఉంటున్న సోము అలియాస్ చిన్ను డెలివరీ బాయ్.

చిక్కబాణసవాడిలో నివాసం ఉంటున్న సుదర్శన్ అలియాస్ రాజు ఫ్లిప్ కాట్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నాడు. జేమ్స్, పప్పీ అనే మరో ఇద్దరు నిందితులు మాయం కావడంతో వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
నిందితులు ఆరు మంది ప్రతి రోజు రాత్రి కమ్మనహళ్ళిలోని కుళ్లప్ప సర్కిల్ దగ్గర గుమికూడుతున్నారు. గత రెండు నెలల నుంచి ఆ యువతిని చూసి ఎలాగైనా ముద్దు (లిప్ లాక్) పెట్టుకోవాలని, కౌగిలించుకోవాలని ప్లాన్ వేశారు.
అవకాశం కోసం నిందితులు ఎదురు చూశారు. డిసెంబర్ 31 అర్దరాత్రి కమ్మనహళ్ళిలోని బిరియాని సెంటర్ నుంచి ఆటోలో బయలుదేరిన యువతి వెనుకనే లెనిన్ అలియాస్ లినో, అయ్యప్ప ఫాలో అయ్యారు.
ఇంటి సమీపంలో ఆటో దిగిన యువతి నడిచి వెలుతున్న సమయంలో లెనిన్ ఆమెను పట్టుకుని నడిరోడ్డులో ముద్దు పెట్టుకుని శారీరకంగా దాడి చేశాడు. లెనిన్ కు అయ్యప్ప తదితరులు సహకరించారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కేవలం ఓ ముద్దు కోసం బెంగళూరు పరువు తీశారని పోలీసులు అంటున్నారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications