నాభర్తను నేనే చంపేశానని జైలుకు వెళ్లిన భార్య, ఏడాదిన్నర తరువాత భర్త ప్రత్యక్షం, షాక్ !

తిరువనంతపురం/కేరళ: దంపతుల మధ్య నిత్యం గొడవలు జరగుతున్నాయి. భర్త మాయం అయిపోయాడు. ఊరందరు భార్య ఆమె భర్తను చంపేసిందని చెప్పారు. నా భర్తను నేను చంపేశానని భార్య అంగీకరించడంతో ఆమెను జైలుకు పంపించారు. ఏడాదిన్నర క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు మళ్లీ కలకలం రేపుతోంది.

కొడుకు కనిపించకుండా పోయాడని, భార్య వేధింపులకు గురిచేస్తోందని, అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారించిన పోలీసుల ఎదుట భార్య కూడా నా భర్తను చంపేశాను అని అంగీకరించింది. తన భర్తను తానే హత్య చేసినట్లు భార్య అందరి ముందు అంగీకరించింది. ఘటన జరిగిన ఏడాదిన్నర తర్వాత భర్త ప్రాణాలతో ప్రత్యక్షం అయ్యాడు.

noushad-afsana-1200-youtube1-down-1690557095-1690626972.jpg -Properties

ఈ ఘటన కేరళలోని పతనందిట్టలో చోటుచేసుకుంది. అదృశ్యమైన నౌషాద్‌ను పోలీసులు గుర్తించి పట్టుకుని వచ్చారు. ఇప్పుడు ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. నౌషాద్, అతని భార్య అఫ్సానా తరచుగా గొడవ పడేవారు. హఠాత్తుగా ఒకరోజు భర్త అదృశ్యమయ్యాడు. నౌషాద్ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అఫ్సానా ఇచ్చిన సమాచారం పోలీసులను నివ్వెరపరిచింది.

తన భర్తతో సంబంధాలు సరిగా లేవు, పదే పదే తనను వేధించాడు, అందుకే నా భర్త నౌషాద్ ను తానే హత్య చేశానని అఫ్సానా అంగీకరించింది. దీంతో అఫ్సాను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. భర్తను హత్య చేసిన అఫ్సానాకు శిక్షపడింది. ఈ ఘటన జరిగి ఏడాదిన్నర గడిచిపోయింది. తొమ్మనుకోట్‌కు చెందిన జయమోన్ ఇటీవల తొడుపుజాకు వెళ్లడంతో అక్కడ నౌషాద్‌ను చూసి అతను షాక్ అయ్యాడు.

arrest2
నౌషాద్‌తో జైమన్ చాలాసేపు మాట్లాడారు. భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు నౌషాద్ అతని స్నేహితుడు జయమాన్ కు వివరించాడు. కానీ ఊర్లో కథ వేరు. నౌషాద్‌ను అతని భార్య హత్య చేసిన కేసులో విచారణ కొనసాగుతోంది. మీ కుటుంబ సభ్యులు తప్పిపోయిన వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు మీ కోసం వెతుకుతున్నారని, నీ భార్య జైల్లో ఉందని జయమాన్ నౌషాద్ కు చెప్పాడు.

జయమాన్ పతనంతిట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. హడలిపోయిన పోలీసులు తోడుపూజకు వెళ్లి నౌషాద్ ను పట్టుకన పతనంతిట్టకు పిలుచుకుని వెళ్లారు. ఓ రోజు ఇంట్లో జరిగిన గొడవ కారణంగా తన మొబైల్ ఫోన్ పగిలిపోయిందని, సిమ్ కార్డుకూడా అందులోనే ఉండిపోయిందని, ఊరి నుంచి పారిపోయి తరువాత తాను మొబైల్ ఫోన్ వాడలేదని. అందుకే కుటుంబ సభ్యులు, బంధువులు, ఊరివాళ్లతో తనకు పూర్తిగా సంబంధాలు తెగిపోయానని నౌషాద్ పోలీసులకు చెప్పాడు.

police

నన్ను హత్య చేశానని తన భార్య అఫ్సానా చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ఆమె ఇలా ఎందుకు చెప్పిందో తనకు తెలియదని నౌషాద్ పొలీసులకు చెప్పాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని, లేదంటే నిన్ను చంపేస్తానని తన భార్య అఫ్సానా తనను బెదిరించిందని, అందుకే ఇంటి నుంచిపారిపోయానని నౌషాద్ పోలీసులకు చెప్పాడు.

నౌషాద్ స్టేట్ మెంట్ లో ఈ కేసు మరో మలుపు తిరిగింది. అఫ్సానా వలన తనకు ప్రాణహాని ఉందని నౌషాద్ చెప్పడం, పోలీసుల విచారణను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించిందని అఫ్సానా మీద మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. అయితే తన భర్త నౌషాద్ నేను హత్య చేశానని అఫ్సానా జైలుకు ఎందుకు వెళ్లింది ? అని అర్థంకాక అందరూ షాక్ అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+