పెళ్లికి వెళ్లిన మహిళ, నకిలి నగలు ఇచ్చి బంగారు నగలతో మేడమ్ జంప్ !

బెంగళూరు/కొడుగు: మోసాలు చెయ్యడానికి అనేకదారులు వెతుక్కుంటున్నారు. కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్‌పేట తాలూకా సిద్ధాపూర్‌లో బయటి జిల్లాకు చెందిన మహిళ బంగారు ఆభరణాలు ఇస్తానని వృద్ధురాలిని నమ్మించి నిజమైన ఆభరణాలు దోచుకుని ఆమెకు నకిలి నగలు ఇచ్చి పరారైన ఘటన చోటు చేసుకుంది. సిద్ధాపూర్ సమీపంలోని బడగ బరంగల గ్రామంలోని తుపనకొల్లికి చెందిన కావేరి అనే మహిళ మోసపోయింది.

జులై 16వ తేదీన తుపనకొలిలోని కాఫీ తోటలో రో హౌస్‌లో నివసిస్తున్న కావేరి అనే మహిళ ఆమె బంధువుల ఇంట్లో జరుగుతున్న పెళ్లికి హాజరు కావడానికి సిద్దాపూర్‌కు వచ్చింది. సిద్ధాపూర్ వీర్రాజుపేట రోడ్డులోని ఓ కళ్యాణమండపంలో పెళ్లి చూసుకున్న కావేరి తరువాత సొంత ఊరు వెళ్లడానికి సిద్ధాపూర్ బస్టాండ్ కు వచ్చింది. ఆ సందర్భంగా మధ్యాహ్నం కావేరి బస్టాప్‌లో నిల్చున్న సమయంలో ఓ గుర్తుతెలియని మహిళ వచ్చి తాను కొళ్లేగాల నివాసి, తన పేరు నిర్మలా అని కావేరిని పరిచయం చేసుకుంది.

woman

తనకు రూ. 500 డబ్బులు కావాలని ఆమె కావేరిని అడిగింది. నా దగ్గర డబ్బులు లేవని కావేరి గుర్తు తెలియని మహిళకు చెప్పింది. వెంటనే ఆ గుర్తు తెలియని మహిళ నా దగ్గర బంగారు నగలు ఎక్కువగా ఉన్నాయని, నీకు ఇస్తానని చెప్పింది. తరువాత గుర్తు తెలియని మహిళ కావేరి ముఖం మీద మత్తుమందు ఉన్న ఓ బట్ట పెట్టడంతో కావేరి కొంచెం మత్తులోకి జారుకుంది.

నా నగలు మొత్తం నీకు ఇచ్చేస్తానని గుర్తు తెలియని మహిళ మత్తులో ఉన్న కావేరికి చెప్పింది. మాయమాటలు నమ్మిన కావేరి ఆమె మెడలోని బంగారు గొలుసులు, చెవుల్లో ఉన్న కమ్మలు, ఉంగరాలు తీసి గుర్తు తెలియని మహిళకు ఇచ్చేసింది. గుర్తు తెలియని మహిళ కూడా కొన్ని నగలు తీసి కావేరి చేతిలో పెట్టి అక్కడి నుంచి మాయం అయ్యింది. తరువాత కావేరి సిద్దాపూర్-వీర్రాజుపేట రోడ్డులోని ఓబంగారు దుకాణంలో గుర్తు తెలియని మహిళ ఇచ్చిన బంగారాన్ని తనిఖీ చేసేందుకు వెళ్లింది.

woman

ఇక్కడ బంగారు ఆభరణాలను తనిఖీ చేయగా అవి నకిలీని తేలింది. ఇది జరిగిన వెంటనే కావేరి బంగారు ఆభరణాలను లూటీ చేసిన గుర్తు తెలియని మహిళ అప్పటికే అదృశ్యం అయ్యింది. మోసపోయిన కావేరి ఇంటికి వెళ్లింది. నీ బంగారు ఆభరణాలు ఎక్కడ అని కూతురు కావేరిని అడగడంతో అసలు విషయం బయటపడింది. మోసపోయిన కావేరి ఆమె కూతురితో కలిసి సిద్దాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహిళను మోసం చేసి లక్షల రూపాయల విలువైన బంగారు నగలు లూటీ చేసిన కిలాడీ లేడీ కోసం కొడుగు పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+