ఈ దేశాల్లో రాత్రి అవదని మీకు తెలుసా..!

సాధారణంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో 24 గంటలు ఉంటాయి. అందులో 12 గంటలు పగలు, మరో 12 గంటలు రాత్రి. దాదాపు అన్ని దేశాల్లో పరిస్థితి ఇలానే ఉంటుంది.భారతదేశంలో కూడా 12 గంటలు పగలుండగా, మరో 12 గంటలు రాత్రి ఉంటుంది.కానీ కొన్ని దేశాల్లో పగటి సమయానికి , రాత్రి సమయానికి చాలా వ్యత్యాసాలు నెలకొన్నాయి. కొన్ని దేశాల్లో పగలు ఎక్కువ సమయం ఉండగా , మరి కొన్ని దేశాల్లో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిల్లో పెద్దగా తేడా ఏమీ కనిపించదు.

కానీ కొన్ని దేశాల్లో రాత్రి కన్నా పగలే ఎక్కువగా ఉంటుంది. భూమిపై చీకటి కొన్ని గంటలు మాత్రమే ఉండే దేశాలు కొన్ని ఉన్నాయి. ఆయా దేశాల్లో దాదాపు 20 గంటలు పగలే ఉంటుంది. అంటే ఈ దేశాల్లో 20 గంటలు సూర్యుడే దర్శనిమిస్తాడు. పగలు ఎక్కువగా ఉండే దేశాలు లిస్ట్‌ను ఓసారి పరిశీలిస్తే.. ఈ జాబితాలో కెనడా దేశం ఉంది. కెనడాలో వేసవి కాల సమయంలో దాదాపు 50 రోజుల పాటు పగలే ఉంటుంది. కేవలం నాలుగు గంటలు మాత్రమే అక్కడ చీకటి పడుతుంది. రాత్రి సమయం అతి తక్కువగా ఉండే జాబితాలో ఫిన్‌‌లాండ్ కూడా నిలిచింది.

there is no real night in these countries

ఇక్కడ మే నుంచి జూలై వరకూ పగలే ఉంటుంది. అంటే ఫిన్‌‌లాండ్‌లో దాదాపు 73 రోజులపాటు పూర్తిగా సూర్యూడే కనిపిస్తాడు. అతి తక్కువ సమయం మాత్రమే ఈ దేశంలో చంద్రుడు కనిపిస్తాడు. ఇక రాత్రి అవని దేశాల జాబితాలో నార్వే సైతం నిలిచింది. ఈ దేశంలో ఏప్రిల్ 10 నుంచి ఆగస్టు 23 వరకూ సూర్యుడే దర్శనిమిస్తాడు. అంటే 76 రోజుల పాటు ఇక్కడ చీకటిని చూడలేము.ఐస్‌లాండ్ దేశంలో జూన్ నెలలో సూర్యుడు అస్తమించడు. అలాస్కా (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో వేసవిలో దాదాపు 84 రోజుల పాటు సూర్యుడు దర్శనం ఇస్తాడు.గ్రీన్లాండ్ (డెన్మార్క్)ద్వీపంలో వేసవిలో దాదాపు 60 రోజుల పాటు సూర్యుడు అస్తమించడు. స్వీడన్ దేశంలో వేసవిలో దాదాపు 100 రోజుల పాటు సూర్యుడు కనిపిస్తాడు.అంటే ఈ దేశాల్లో కొన్ని గంటల మాత్రమే చీకటి పడుతుందన్న మాట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+