Gaganyaan Astronauts: గగన్ యాన్ కు వెళ్లే నలుగురు వ్యోమగాములు వీరే-ఇస్రో ప్రకటన..!
భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే చంద్రయాన్ ప్రయోగాలు, ఆ తర్వాత ఆదిత్య మిషన్ తో అంతర్జాతీయంగా ఇస్రో పేరు మార్మోగుతోంది. ఈ నేపథ్యంలో గగన్ యాన్ పేరుతో మరో భారీ ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది.
ఇందులో భాగంగా అంతరిక్షానికి వెళ్లే నలుగురు వ్యోమగాముల్ని ఇస్రో ఎంపిక చేసింది. వీరి పేర్లు, ఇతర వివరాలను ఇవాళ వెల్లడించింది.

గగన్ యాన్ ప్రయోగం కోసం ఇస్రో ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల్లో గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఉన్నారు. ఈ నలుగురిని గగన్ యాన్ ప్రయోగంలో భాగంగా అంతరిక్షానికి పంపనున్నట్లు ఇస్రో ఇవాళ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నలుగురిని ప్రధాని మోడీ ఇవాళ స్వయంగా కలిసి అభినందించారు.
Meet the 4 Indians going to space as part of the Gaganyaan mission!
— Akshita Nandagopal (@Akshita_N) February 27, 2024
-Group captain Prasanth Balakrishnan Nair
-Group captain Ajit Krishnan
-Group captain Angad Pratap
-Wing commander Shubhanshu Shukla pic.twitter.com/EDxkwwJ1Du
2019 జూన్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఈ నలుగురు వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు ఇస్రో.. రష్యా అంతరిక్ష సంస్ధ రాస్ కాస్మోస్ అనుబంధ సంస్ధ అయిన గ్లావ్ కాస్మోస్ తో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం నలుగురు వ్యోమగాములు రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో ఫిబ్రవరి 2020 నుండి మార్చి 2021 వరకు శిక్షణ పొందారు. మరోవైపు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా కూడా 2024 చివరి నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మిషన్ కోసం భారతీయ వ్యోమగామికి శిక్షణ ఇస్తుంది.
గగన్‌యాన్ 3 రోజుల మిషన్ కోసం వ్యోమగాములను భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశ మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని చాటి చెప్పనుంది. ఆ తర్వాత భారత సముద్ర జలాల్లో ల్యాండింగ్‌తో వాటిని సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నారు.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications