ఈ గ్రామాలు దాదాపు ఐదు ద‌శాబ్దాలుగా దీపావ‌ళికి దూరం...

దేశ‌వ్యాప్తంగా దీపావ‌ళి సంబురాలు ఇప్ప‌టినుంచే ప్రారంభ‌మ‌య్యాయి. దీపావ‌ళి పండుగ‌కు ఊరు, వాడా సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ఒక‌పక్క దీపావ‌ళి సంద‌ర్భంగా దేశమంతా వెలుగులతో నిండిపోతుంటే, పంజాబ్‌లోని కొన్ని గ్రామాల్లో మాత్రం చీక‌ట్లు అలుముకున్నాయి. దీపావ‌ళి వేడుక‌ల‌కు ఇక్క‌డి కొన్ని గ్రామాలు దాదాపు ఐదుద‌శాబ్దాలుగా దూరంగా ఉంటున్నాయి. దీపావ‌ళి సంబ‌రాల‌ను ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించుకునేందుకు దేశ‌మంతా ఎంత‌గానో ఎదురుచూస్తుంది. అయితే, పంజాబ్‌లోని ఈ గ్రామాలు మాత్రం గ‌త 50 ఏళ్లుగా దీపావ‌ళికి దూరంగా ఉన్నాయి.

దీపావ‌ళి వేళ.. ఈ మూడు గ్రామాల్లో చీక‌ట్లు: బ‌ఠిండా జిల్లాలోని మూడు గ్రామాలు మాత్రం దీపావ‌ళి సంబ‌రాలు లేక మూగ‌బోతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఆర్మీ కంటోన్మెంట్‌, మందుగుండు సామాగ్రి డిపో వుండ‌డ‌టం వ‌ల్ల ఈ గ్రామాలు దీపావ‌ళిని జ‌రుపుకోవ‌డం లేదు. బ‌ఠిండా జిల్లాలోని పూస్‌మండి, భ‌గూ, గులాభ్‌గ‌ఢ్ గ్రామాల్లో బాణాసంచా పేల్చ‌డం, పంట వ్య‌ర్థాల‌ను కాల్చ‌డం పై ఏన్నో ఏళ్ల‌నుంచే నిషేదం విధించారు. అందుకే ఈ మూడు గ్రామాల వారు దీపావ‌ళి వంటి పండుగ‌ల‌ను ఎన్నో యేళ్ల నుంచి జ‌రుపుకోవ‌డం ఆపేశారు.

These villages have been away from Diwali for almost five decades...

ఆర్మీ కంటోన్మెంట్‌, మందుగుండు సామాగ్రి డిపోలు: ఈ ప్రాంతంలో 1976లోనే భారీగా భూమిని సేక‌రించి ఆర్మీ కంటోన్మెంట్‌, మందుగుండు సామాగ్రి డిపోల‌ను ఏర్పాటు చేశారు. పండుగ‌నాడు త‌మ‌పిల్ల‌ల్ని ట‌పాసులు కాల్చుకునేందుకు బంధువుల ఇంటికి పంపిస్తామ‌ని, నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఎవ‌రైనా ఇక్క‌డ ట‌పాసులు కాలిస్తే జిల్లాయంత్రాంగం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ఇక్క‌డి వారు చెబుతున్నారు. అంతేకాకుండా ఇక్క‌డ గ‌డువు ముగిసిన మందుగుండు పేల్చ‌డం వ‌ల్ల ఇక్క‌డి గ్రామాల్లో వాటి శ‌క‌లాలు ప‌డిన ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయ‌ని ఇక్క‌డి వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

These villages have been away from Diwali for almost five decades...

రోడ్డు మార్గాలు కూడా లేవు: ఈ ఘ‌ట‌న‌ల ద్వారా ఇక్క‌డివారికి ఎంతో ఆస్తి న‌ష్టం వాటిల్లింద‌ని, వాటిపై ఫిర్యాదులు చేసినా ఇక్క‌డి అధికారులు ప‌ట్టించుకోలేద‌ని గ్రామ‌స్థులు వాపోతున్నారు. వీటితో పాటు ఈ ప్రాంతాల్లో కొత్త నిర్మాణాల‌ను చేప‌ట్ట‌కూడ‌ద‌నే ఆంక్ష‌ల‌ను కూడా విధించారని స్థానికులు తెలిపారు. ఇంకా ఇక్క‌డ స‌రైన రోడ్డు మార్గాలు కూడా లేవ‌ని అంటున్నారు. ఎటువంటి సౌక‌ర్యాలు లేక‌పోవ‌డంతో ఇక్క‌డి భూముల ధ‌ర‌లు కూడా పెర‌గ‌డం లేద‌ని ఈ ప్రాంతంలోని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వీట‌న్నింటితో పాటు ఇలాంటి పండుగ సంద‌ర్భాల‌లో కూడా బంధువులెవ్వ‌రూ ఈ ప్రాంతాలకు రావ‌డం లేద‌ని, అందుకే దీపావ‌ళి పండుగ‌ను జ‌రుపుకోలేక‌పోతున్నామ‌ని గ్రామ‌స్థులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+