• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సుశాంత్ కూడా ఇలాగే భయపడవచ్చు... కాల్పుల ఘటనపై కంగనా సంచలన కామెంట్స్...

|

శుక్రవారం(అగస్టు 1) రాత్రి ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంటి వద్ద కాల్పుల కలకలం రేగింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో ఉన్న తన నివాసంలో కంగనా ఉంటున్నారు. రాత్రి 11.30గం. సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటి బయట కాల్పులు జరిపారు. దీంతో వెంటనే సెక్యూరిటీని అప్రమత్తం చేయగా.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

8 సెకన్ల వ్యవధిలో రెండుసార్లు...

8 సెకన్ల వ్యవధిలో రెండుసార్లు...

కంగనా నివాసానికి సమీపంలోనే యాపిల్ తోటలు ఉండటంతో... అక్కడ గబ్బిలాలను ప్రారదోలేందుకు ఎవరైనా తుపాకీతో కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే తమ ఇంటి చుట్టుపక్కల వాళ్లు మాత్రం దాన్ని ఖండించారని కంగనా తెలిపారు. తనకూ తుపాకీ శబ్దాలు ఎలా ఉంటాయో తెలుసునని.. బుల్లెట్ శబ్దాలు తనకు వినిపించాయని చెప్పారు. 8 సెకన్ల వ్యవధిలో రెండు సార్లు తనకు కాల్పుల శబ్దం వినిపించిందన్నారు.

సుశాంత్ కూడా ఇలాంటి వాటికే భయపడవచ్చు...

సుశాంత్ కూడా ఇలాంటి వాటికే భయపడవచ్చు...

తనను బెదిరింపులకు గురిచేసేందుకే ఇలాంటివి చేస్తున్నారని... ఏడెనిమిది వేల రూపాయాలిచ్చి ఇలాంటి పనులు చేయించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ముఖ్యమంత్రి కొడుకును ఉద్దేశించి తాను కామెంట్స్ చేసినరోజే ఈ ఘటన జరగడం యాథృచ్చికం కాదన్నారు. సీఎం కొడుకును టార్గెట్ చేసినందుకు ఇక ముంబైలో తనను కష్టాలకు గురిచేస్తారని కొంతమంది తనతో చెప్తున్నట్లు చెప్పారు. అయితే ముంబైలోనే కాదు,ఇక్కడ కూడా తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. దేశంలో బహిరంగ గూండాగిరి నడుస్తోందా అని ప్రశ్నించారు. సుశాంత్ కూడా ఇటువంటి పరిణామాలకే భయపడి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. కానీ తాను మాత్రం ప్రశ్నించడం కొనసాగిస్తానని తేల్చి చెప్పారు.

  Sushant Singh Rajput : మోదీ గారూ.. మీరే న్యాయం చేయాలి.. అంటూ సుశాంత్ సోదరి లేఖ వైరల్ ! || Oneindia
  సీఎం కొడుకును టార్గెట్ చేసిన కంగనా

  సీఎం కొడుకును టార్గెట్ చేసిన కంగనా

  సుశాంత్ మరణం తర్వాత కంగనా పలువురు బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజా కంగనా టీమ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే తనయుడు,మంత్రి ఆదిత్యా థాక్రేని టార్గెట్ చేసింది. సుశాంత్ ఆత్మహత్యకు ముందు అతని ఇంట్లో పార్టీ జరిగిందని.. అందులో ఓ ప్రముఖ వ్యక్తి పాల్గొన్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... ఆ వ్యక్తి ఎవరో అందరికీ తెలుసంటూ పరోక్షంగా ఆదిత్యా థాక్రే పేరును కంగనా ప్రస్తావించారు. ఆయన కరణ్ జోహార్‌కు బెస్ట్ ఫ్రెండ్ అని, అందరూ ప్రేమగా బేబీ పెంగ్విన్ అని పిలుస్తారని చెప్పుకొచ్చారు. అంతేకాదు,ఒకవేళ తాను ఇంట్లో ఉరివేసుకుని చనిపోయినట్లుగా కనిపిస్తే... దాన్ని ఆత్మహత్యగా భావించకండి అని పేర్కొన్నారు.

  English summary
  Kangana Ranaut called the police to her home in Manali after she heard gunshots nearby late Friday night. Kangana believes it’s an attempt to intimate her after she ‘made comments about the chief minister’s son.’
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X