ఇదే ఛాన్స్: కొత్త పార్టీతో రాజకీయాల్లోకి రజనీకాంత్

జయలలిత మరణం తర్వాత సంభవిస్తున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి రజనీకాంత్‌కు మంచి అవకాశం ఉందని ఆయన సోదరుడు సత్యనారాయణరావు అంటున్నారు.

చెన్నై: జయలలిత మరణంతో తమిళ రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. సూపర్ స్టార్ తమిళ రాజకీయాల్లో ఇదే అదునుగా ప్రవేశిస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అందుకు అనుగుణంగానే ఆయన సోదరుడు సత్యనారాయణరావు ఓ ప్రకటన చేశారు.

ఆయన ప్రకటనను చూస్తుంటే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది కొత్త పార్టీతో రజనీకాంత్ రాజకీయాల్లోకి అడుగుపెడుతారని ఆయన అన్నారు.

రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి ఇదే మంచి తరుణమని ఆయన సోదరుడు సత్యనారాయణరావు అభిప్రాయపడ్డారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుండో అభిమానులు కోరుతున్నారని, వారి కోరికను నెరవేర్చేందుకు ఇది అనువైన సమయంగా తాను భావిస్తున్నానని సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

This is the best Rajinikanth to enter politics

జయలలిత మరణంతో తమిళనాట మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రజనీకాంత రాజకీయాల్లోకి వచ్చేందుకు నూటికి నూరుశాతం ఇదే మంచి తరుణమని అన్నారు. రజనీ నటిస్తున్న చిత్రం షూటింగ్‌ వచ్చే ఏడాదిలో పూర్తవుతుందని, అప్పటివరకు రజనీ రాష్ట్ర రాజకీయపరిస్థితులను పరిశీలిస్తుంటారని, ఆ తర్వాతే ఏదైనా జరగవచ్చని చెప్పారు.

రజనీకాంత్ బీజేపీలో చేరుతారా అని అడుగగా.. ఎట్టి పరిస్థితులలోనూ ఆ నిర్ణయం తీసుకోరనీ, కొత్త పార్టీనే ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. పార్టీని ప్రారంభిస్తే రజనీ తప్పకుండా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, రజనీకాంత్‌కు బిజెపితో సన్నిహిత సంబంధాలున్నాయనే ప్రచారం సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+