వీడియో వైరల్: హాస్పిటల్ బెడ్‌పైన ఈ చిన్నారి ఏం చేసిందో తెలుసా..?

కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందారు. చాలా మంది చికిత్స పొందుతున్నారు. ఇక మనదేశంలో కూడా కరోనావైరస్ విజృంభిస్తోంది. అయితే ఈ విపత్కర సమయంలో ముందుండి సేవలు అందిస్తున్నారు వైద్య సిబ్బంది. ఇక కొంతమంది పేషెంట్లు చికిత్సకు సహకరిస్తుంటే మరికొందరేమో వైద్యులకు ఎదురుతిరుగుతున్నారు. కానీ హాస్పిటల్‌లో కరోనావైరస్‌ బారిన పడి అడ్మిట్‌ అయిన వారితో వైద్యులు ఎంతో ప్రేమతో వ్యవహరిస్తుండటం పలువురిని ఆకట్టుకుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన ఓ 15 నెలల చిన్నారి నర్సింగ్ అధికారితో వ్యవహరించిన తీరు ఆకట్టుకుంటోంది.

చండీగఢ్‌లో కరోనావైరస్ బారిన పడిన 15 నెలల చిన్నారి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ అండ్ రీసెర్చ్‌లో అడ్మిట్ అయ్యింది. ఆ చిన్నారి అందరినీ ఆకట్టుకుంటోంది. హాస్పిటల్‌లో బెడ్ పై ఉన్న చిన్నారి నర్సింగ్ అధికారి నరేంద్ర త్యాగిని చూసి అతనికి ఫ్లయింగ్ కిస్‌లు, షేక్ హ్యాండ్స్ ఇచ్చింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను మే 4వ తేదీ రాత్రి 11:30 గంటలకు రికార్డు చేశారు. ఆరోజు నరేంద్ర త్యాగి రాత్రి షిఫ్ట్‌లో ఉన్నారు.

This kid blows flying kisses to the staff in hospital, video goes viral

ఇక ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ చిన్నారి తన తల్లి చెబుతున్న మాటలు విని ఆ ప్రకారం నడుచుకోవడం ఆకట్టుకుంటుంది. నర్సింగ్ ఆఫీసర్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వగా ఆ చిన్నారి కూడా తిరిగి ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఆ తర్వాత గదిలో ఉన్నవారు సారీ చెప్పమంటే సారి చెబుతుంది. ఈ దృశ్యం చూసిన నెటిజెన్లు ఫిదా అయ్యారు. అయితే ఈ వీడియో వైరల్ కావడానికి కారణం ఇందులో కనిపిస్తున్న నర్సింగ్ ఆఫీసర్ నరేంద్ర త్యాగి ఆ బిడ్డకు చాలా దగ్గరగా ఉండి మాట్లాడటం. సాధారణంగా కరోనావైరస్ బారిన పడిన పేషెంట్ల వద్ద వైద్య సిబ్బంది సామాజిక దూరం పాటిస్తారు. అయితే ఈ వీడియోలో చిన్నారికి దగ్గరగా ఉండటమే కాకుండా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడం పలువురిని ఆలోచింపజేసింది.

ఈ చిన్నారి చాలా యాక్టివ్ అని తాను డ్యూటీలో ఉన్న సమయంలో ఇంకా నిద్రపోలేదని చెప్పారు నరేంద్ర త్యాగి. రాత్రి 11:30 గంటల సమయంలో చిన్నారి తన బెడ్‌పై నిల్చుని ఆడుకుంటోందని చెప్పారు. ఆ బిడ్డ ఎంతో ముద్దుగా ఉండటంతో తన మనస్సు ఆగలేకపోయిందని అందుకే దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చినట్లు త్యాగి చెప్పారు. ఇంకా ఆ చిన్నారి హాస్పిటల్‌లోనే ఉన్నట్లు త్యాగి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+