Helicopter crash: జమ్మూ కాశ్మీర్‌లో కూలిన హెలికాప్టర్..
జమ్మూ కాశ్మీర్ లో గురువారం ఉదయం హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఆర్మీ ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ ప్రాంతంలో కూలిపోయింది. హిల్ జిల్లా మార్వా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ గాయపడ్డారు. ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్ లో ముగ్గురు ఉన్నట్లు అధికారులు ముందుగా తెలిపారు.
"ఉదయం 11:15 గంటలకు, ఆర్మీ ఏవియేషన్ ALH ధృవ్ హెలికాప్టర్ కార్యాచరణ మిషన్‌లో భాగంగా J&K కిష్త్వార్ ప్రాంతంలోని మారువా నది ఒడ్డున ముందుజాగ్రత్తగా ల్యాండింగ్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది." అని భారత సైన్యం తెలిపింది. తక్షణ సహాయక చర్యలు ప్రారంభించామని అధికారులు చెప్పారు. ఆర్మీ రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయని వివరించారు.

"హెలికాప్టర్ లో ఇద్దరు పైలట్లు, ఒక సాంకేతిక నిపుణుడు ఉన్నారు. గాయపడిన ముగ్గురు సిబ్బందిని ఉధంపూర్ కమాండ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది" అని భారత సైన్య అధికారులు తెలిపారు.
ఈ మార్చి ప్రారంభంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని మండల కొండల ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ చీతా హెలికాప్టర్ కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు మరణించారు.
ప్రమాదం జరిగిన తర్వాత ఇండియన్ ఆర్మీ, సశాస్త్ర సీమా బల్ (SSB) మరియు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
అధికారుల ప్రకారం, ఆర్మీకి చెందిన చితా హెలికాప్టర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో సంబంధాన్ని కోల్పోయి ప్రమాదం జరిగింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications