భారీ వర్షాలు, ఇంటి పైకప్పు కుప్పకూలి ఒకే ఫ్యామిలీలో ముగ్గురి మృతి, భర్త !

బెంగళూరు: భారీ వర్షాల కారణంగా ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందిన ఘటన కర్ణాటకలోని కోప్పళ తాలుకా, యలమగెరి ప్రాంతంలో జరిగింది. ఇంటిలో నిద్రపోతున్న సుజాత(22), అమరేష్(18), గవి సిద్దప్ప(15) అనే కుటుంబ సభ్యులు మృతి చెందారు.

ఇదే ప్రమాదంలో సుజాత భర్త సోమణ్ణ తీవ్రగాయాలై ప్రాణాలతో భయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత రెండు వారాల నుంచి కోప్పళ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. సోమణ్ణ నివాసం ఉంటున్న ఇల్లు భారీ వర్షాలకు దెబ్బతింది.

 Three people died in house collapse in yalamageri of koppal district in Karnataka.

సోమవారం రాత్రి సోమణ్ణ, సుజాత, అమరేష్, గవి సిద్దప్ప కలిసి అందరూ భోజనం చేశారు. భోజనం చేసిన తరువాత సోమణ్ణ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిలో నిద్రపోయారు. మంగళవారం ఉదయం సోమణ్ణ నివాసం ఉంటున్న ఇంటి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

ఈ ప్రమాదంలో సోమణ్ణ కుటుంబ సభ్యులు నలుగురికి తీవ్రగాయాలైనాయి. వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని భాదితులను రక్షించడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే ఊపిరి ఆడకపోవడంతో గవి సిద్దప్ప సంఘటనా స్థలంలో మృతి చెందాడు.

ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్న సమయంలో సుజాత, అమరేష్ మరణించారని పోలీసులు చెప్పారు. సోమణ్ణకు తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, భారీ వర్షాలకు ఇంటి పైకప్పు దెబ్బతిని కుప్పకూలడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+