Trans Gender: ఎస్సైలుగా ఉద్యోగం సాధించిన ముగ్గురు ట్రాన్స్ జెండర్స్..

చాలా మంది ట్రాన్స్ జెండర్స్ ను నీచంగా చూస్తారు. వారిని అడుక్కునే వారిగా భావిస్తారు. కొంత మంది అయితే వారిని అంటరాని వారుగా చూస్తుంటారు. అయితే వారు కూడా మనుషులేనని గుర్తించారు. అయినప్పటికీ ట్రాన్స్ జెండర్స్ తామేమి తక్కువ కాదంటున్నారు. అందరితో పోటీ పడుతున్నారు. తాజాగా ముగ్గురు ట్రాన్స్ జెండర్స్ ఉద్యోగం సాధించారు. ఇందులో బీహార్‌లోని భాగల్‌పూర్ గ్రామానికి చెందిన మధు కశ్యప్ అనే ట్రాన్స్ జెండర్ కు ఎస్సై ఉద్యోగం వచ్చింది.

పరీక్షలకు ముందు శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఆమె ఆరు నెలల ప్రిపరేషన్‌ను కోల్పోయింది. అయినప్పటికీ పోలీస్ యూనిఫాం ధరించాలనే జీవితకాల కలని విడిచి పెట్టలేదు. ఎట్టకేలకు జాబ్ సాధించింది. పరీక్షల కోసం ఆమెకు పాట్నాకు చెందిన విద్యావేత్త గురు రెహమాన్ శిక్షణ ఇచ్చారు. మధు కూడా ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ కానిస్టేబుల్ పరీక్ష రాత పరీక్షలో అర్హత సాధించిందని రెహమాన్ చెప్పాడు. కానీ శస్త్రచికిత్స సమస్యల కారణంగా వైద్య పరీక్షకు హాజరు కాలేదని తెలిపాడు.

Three transgenders got jobs as Sub Inspectors in Bihar

కానీ ఆమె బలంగా తిరిగి వచ్చిందని.. ఉద్యోగం సాధించిందని పేర్కొన్నాడు. రాష్ట్రంలో SI ఉద్యోగాలకు అర్హత సాధించడానికి బీహార్ పోలీస్ సబార్డినేట్ సెలక్షన్ కమిషన్ (BPSSC) పరీక్షలను ఛేదించిన ముగ్గురు ట్రాన్స్ వ్యక్తులలో మధు ఒకరిగా ఉన్నారు. బీహార్ ట్రాన్స్ కమ్యూనిటీకి
ఈ సంవత్సరం పరీక్షలకు హాజరైన 6788 మంది అభ్యర్థుల్లో 1,275 మంది అభ్యర్థులు ఉద్యోగం సాధించారు. వీరిలో 822 మంది పురుషులు, 450 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.

ఉద్యోగం సాధించిన వారిలో 275 మంది షెడ్యూల్డ్ కులాలు, 238 మంది EBC, 100 OBC, 87 మంది మహిళలు - 11 EWS, 16 షెడ్యూల్డ్ తెగల వారు ఉన్నారు. మధు కాకుండా, మరో ఇద్దరు ట్రాన్స్ రోనిత్, బాంటీ ఉద్యోగం సాధించిన ట్రాన్స్ జెండర్లుగా ఉన్నారు. గతేడాది నిర్వహించిన బీహార్ కులాల సర్వే ప్రకారం రాష్ట్రంలో 40,827 మంది ట్రాన్స్‌ జెండర్లు ఉన్నారు. లింగ అంతరాన్ని తొలగించే దిశగా మరో అడుగు వేసినట్లుగా భావిస్తున్నట్లు మధు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+