Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TikTok: డబుల్ బెడ్ రూమ్ హౌస్, తల్లి టీ 20, కూతురు వన్ ‘డే’మ్యాచ్ లు, ఇంట్లోనే లవర్స్, చివరికి !

చెన్నై/ తిరుప్పూర్: TikTok పిచ్చితో మునిగిపోయిన భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. పేరు కనకం అయినా ఒళ్లంతా కామం, బుద్ది మాత్రం శునకం బుద్ది. అసలే డబుల్ బెడ్ రూమ్ హౌస్. తల్లి చేష్టలతో కూతురు బుద్దిమారిపోయింది. తల్లి టీ 20 మ్యాచ్ ఆడితే కూతురు వన్ డే మ్యాచ్ ఆడింది. తల్లి ఒక బెడ్ రూమ్ లో, కూతురు మరో బెడ్ రూమ్ లో వారివారి లవర్స్ తో రొమాన్స్ చేశారు. చివరి తల్లి, కూతురు ఇద్దరు ఇళ్లు విడిచి ప్రియులతో కలిసి పారిపోయారు. పోలీసు పట్టుకుని వచ్చినా మళ్లీ తల్లి, కూతురు అదే పని చేశారు. ఫోన్ చేసి బతిమిలాడినా భార్య, కూతురు ఇంటికి రాకపోవడంతో విరక్తి చెందిన భర్త ఇలాంటి జీవితం పగవాడికి ఎదురుకాకూడదు దేవుడా అంటూ ఓ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు.

 పేరు కనకం... ఒళ్లంతా కామం

పేరు కనకం... ఒళ్లంతా కామం

తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా పొమ్మనాయకనలైం ప్రాంతంలో రవి, కనకవల్లి దంపతులు నివాసం ఉంటున్నారు. రవి కనకవల్లి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రవి, కనకవల్లి దంపతుల కుమార్తె ఇంటర్ (ఫ్లస్ టూ) రెండో సంవత్సరం చదువుతోంది. కనకవల్లి పేరులో కనకం (బంగారం) ఉన్నా ఆమె ఒళ్లంతా కామంతో రగిలిపోతుంది.

 ఆంటీకి టిక్ టాక్ బాయ్ ఫ్రెండ్స్

ఆంటీకి టిక్ టాక్ బాయ్ ఫ్రెండ్స్

రవి సొంతంగా వర్క్ షాప్ నిర్వహిస్తున్నాడు. భర్త రవి ఉదయం షాపు దగ్గరకు వెళితే రాత్రే ఇంటికి వెలుతున్నాడు. కనకవల్లికి టిక్ టిక్ పిచ్చి విపరీతంగా ఉంది. ఇప్పటికే కొన్ని వందల టిక్ టాక్ వీడియోలు తీసిన కనకవల్లి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కనకవల్లి టిక్ టాక్ వీడియోలు చూసిన కొందరు ఆమెతో పరిచయం పెంచుకున్నారు. టిక్ టాక్ ఫ్యాన్స్ అయిన యువకులతో కనకవల్లి పిచ్చపాటిగా మాట్లాడుతోంది. తల్లి కనకవల్లి టిక్ టాక్ పిచ్చి ఇంటర్ చదువుతున్న కూతురికి పట్టుకుంది. అంతే ఓపక్క తల్లి, మరోపక్క కూతురు టిక్ టాక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కాలంగడిపారు.

 అర్దరాత్రి హాట్ మెసేజ్ లు

అర్దరాత్రి హాట్ మెసేజ్ లు

భర్త రాత్రి ఇంటికి వచ్చిన తరువాత కనకవల్లి ఆమె బాయ్ ఫ్రెండ్స్ తో మాట్లాడదు. అయితే లాక్ డౌన్ లో భర్త రవి ఎక్కువగా ఇంట్లోనే ఉండటంతో కనకవల్లికి కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. అర్దరాత్రి సమయంలో కనకవల్లికి హాట్ హాట్ మెసేజ్ రావడం మొదలైనాయి. భర్త రవి నిద్రపోయినప్పుడు, బాత్ రూమ్ లో స్నానానికి వెళ్లిన టైమ్ లో కనకవల్లి ప్రియులకు మెసేజ్ చేస్తూ కాలం గడిపింది. పిల్లలు చదువుతున్నారా ? భర్తకు సక్రమంగా భోజనం చేసిపెడుతున్నామా అనే ధ్యాస ఏమాత్రం లేకుండా కనకవల్లి నిత్యం టిక్ టాక్ వీడియోలు, సోషల్ మీడియాలో పరిచయాలు అయిన బాయ్ ఫ్రెండ్స్ తో కాలం గడిపింది.

 తల్లి టీ 20 మ్యాచ్, కూతురు వన్ ‘డే'మ్యాచ్

తల్లి టీ 20 మ్యాచ్, కూతురు వన్ ‘డే'మ్యాచ్

రవి ఇంట్లో రెండు బెడ్ రూమ్ లు ఉన్నాయి. బరితెగించిన కనకవల్లి ఈరోడ్ కు చెందిన ఓ బాయ్ ఫ్రెండ్ తో పీకలదాక ప్రేమలో మునిగిపోయి ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. భర్త రవి ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే భార్య కనకవల్లి ఆమె ప్రియుడిని ఇంటికి పిలుపించుకుని బెడ్ రూమ్ లో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. తల్లి కనకవల్లి విషయం కళ్లారా చూసిన ఆమె కూతురు బరితెగించిపోయింది. తల్లి ప్రియుడు ఇంటికి వస్తున్నాడని తాను ఎందుకు తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకోకూడదని ఆలోచించింది. అంతే కూతురు ప్రియుడు ఇంటికి వెళ్లి ఆమెతో సరాలు ఆడటం మొదలుపెట్టాడు.

 మంచి రోజు చూసి తల్లి, కూతురు ఎస్కేప్

మంచి రోజు చూసి తల్లి, కూతురు ఎస్కేప్

ఇంటిలోని వేర్వేరు బెడ్ రూమ్ ల్లో ప్రియుడితో తల్లి కనకవల్లి, బాయ్ ఫ్రెండ్ తో కూతురు ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సమాచారం ఇవ్వడంతో రవి భార్య కనకవల్లి, కుమార్తెను తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. చివరికి బరితి తెగించిన తల్లి కనకవల్లి, ఆమె కూతురు వారివారి ప్రియులతో కలిసి ఇంటి నుంచి పారిపోయారు. రాత్రి ఇంటికి వెళ్లిన రవి భార్య కనకవల్లి, కుమార్తె కనపడకపోవడంతో షాక్ కు గురై పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు వారి కోసం గాలించారు.

 ఈరోడ్ లో తల్లి కూతురు కాపురం

ఈరోడ్ లో తల్లి కూతురు కాపురం

కేసు నమోదు చేసిన పోలీసులు మొబైల్ నెంబర్ల ఆధారంగా తల్లి కనకవల్లి, కుమార్తె కోసం గాలించారు. ఈరోడ్ లో తల్లి, కూతురు కాపురం పెట్టారని తెలుసుకున్న పోలీసులు ఇద్దరిని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చి రవితో ఇంటికి పంపించారు. కనకవల్లి కుటుంబ సభ్యులు కూడా తల్లి, కుమార్తెకు బుద్దిమాటలు చెప్పారు. కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న తల్లి, కుమార్తె మళ్లీ వారి ఇద్దరు ప్రియులతో కలిసి మళ్లీ ఇంటి నుంచి జెండా ఎత్తేసి పారిపోయారు.

 కొడుకు కోసం చివరి వీడియో

కొడుకు కోసం చివరి వీడియో

భార్య, కుమార్తెల అక్రమ సంబంధం విషయం ఊరందరికి తెలిసిపోయిందని ఆవేదనతో కుమిలిపోయిన రవి ఇంటికే పరిమితం అయ్యాడు. భార్య, కూతురిని ఫోన్ చేసి ఇంటికి రావాలని వేడుకున్నాడు. అయితే ఇంటికి తిరిగిరామని, నేనే, నా కూతురు మా ప్రియులతోనే కలిసి ఉంటామని కనకవల్లి తేల్చి చెప్పింది. తన అన్న, తమ్ముడి మీద తనకు చాలా నమ్మకం ఉందని, నా కొడుకును వాళ్లు బాగా చూసుకుకి చదవిస్తారనే ధైర్యంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియో తీసిన రవి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తీసిన వీడియోను రవి అతని కుటుంబ సభ్యులకు షేర్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రవి భార్య కనకవల్లిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+