Lovers: ఇంటర్ కాలేజ్ అమ్మాయి ఇన్ స్టాగ్రామ్ లవ్ స్టోరీ, ప్రియుడితో కలిసి తిరుపతి హైస్పీడ్ రైలు ?
తన ప్రియుడిని పెళ్లి చేసుకుంటానని ప్రియురాలు ఆమె ఇంట్లో చెప్పింది. నువ్వు ఇంకా మైనర్, కాలేజ్ లో బుద్దిగా చదువుకోమని చెబితే ప్రేమా, దోమా అంటావా అని ఆమె కుటుంబ సభ్యులు మండిపడ్డారు.
చెన్నై/ తిరువణ్ణామలై: ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పడం చాలా కష్టం. కాలేజ్ వయసులో, కొందరు అయితే స్కూల్ లోనే ప్రేమ పెళ్లి అంటూ తెగ తిరిగేస్తున్నారు. ఇక సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా పరిచయం అవుతారో చెప్పడం చాలా కష్టం. కాలేజ్ కు వెలుతున్న మైనర్ అమ్మాయి, ఓ యువకుడు ప్రేమించుకున్నారు. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు డిసైడ్ అయ్యింది. ఇదే విషయం ప్రియురాలు ఆమె ఇంట్లో చెప్పింది. నువ్వు ఇంకా మైనర్, కాలేజ్ లో బుద్దిగా చదువుకోమని చెబితే ప్రేమా, దోమా అంటావా అంటూ ఆమె కుటుంబ సభ్యులు మండిపడ్డారు. అంతే ప్రియుడితో కలిసి మైనర్ అమ్మాయి రైలు పట్టాల మీదకు వెళ్లిపోయింది.

ఇంటర్ కాలేజ్ అమ్మాయి
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని అరణి లో 17 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. అరణిలోని కాలేజ్ లో ఆ అమ్మాయి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ప్రతిరోజు ఆ అమ్మాయి కాలేజ్ కు వెళ్లి వస్తోంది. ఇంటర్ మొదటి సంవత్సరం వరకు బాగా చదువుకున్న అమ్మాయి తరువాత సోషల్ మీడియాలో పిచ్చిలో మునిగిపోవడంతో ఆమె జీవితంలోకి ఓ యువకుడు ఎంట్రీ ఇచ్చాడు.

ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం
ఆరణి ప్రాంతంలోనే నివాసం ఉంటూ ప్రైవేట్ ఐటీఐ కాలేజ్ చదువుతన్న శక్తివేల్ అనే యువకుడికి, ఇంటర్ కాలేజ్ అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యింది. శక్తివేల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో విభిన్నంగా వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు. శక్తివేల్ క్రియేటివిటికి ఆ అమ్మాయి పడిపోయింది. తరువాత శక్తివేల్, ఇంటర్ కాలేజ్ అమ్మాయి ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

వార్నింగ్ ఇచ్చిన అమ్మాయి ఫ్యామిలీ
గత ఏడాది నుంచి ఇంటర్ కాలేజ్ అమ్మాయి, శక్తివేల్ ప్రేమించుకుంటున్నారు. ప్రతిరోజు కాలేజ్ కు వెలుతున్న ప్రేమికులు ఏదో ఒకటైమ్ లో కలుసుకుంటున్నారు. ఇద్దరూ చాలా గాఢంగా ప్రేమించుకోవడంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. నా ప్రియుడు శక్తివేల్ ను పెళ్లి చేసుకుంటానని ప్రియురాలు ఆమె ఇంట్లో చాలా ధైర్యంగా చెప్పింది. మైనర్ కూతురు ప్రేమ విషయం చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

కాలేజీకి వెళ్లి చదువుకోవాలి అంతే కాని ?
నువ్వు ఇంకా మైనర్, కాలేజ్ లో బుద్దిగా చదువుకోమని చెబితే ప్రేమా, దోమా అంటావా, ఇంకో సారి లవ్ అంటే నిన్ను కాలేజ్ కు పంపించకుండా ఇంట్లో కుర్చోబెడుతామని ఆమె తల్లి, కుటుంబ సభ్యులు కాలేజ్ అమ్మాయి మీద మండిపడ్డారు. ఎప్పటిలాగే ఇంటర్ కాలేజ్ అమ్మాయి, శక్తివేల్ కాలేజ్ కు అని చెప్పి ఉదయం వారివారి ఇళ్ల నుంచి బయలుదేరి బయటకు వెళ్లారు.

తిరుపతి రైలు కిందపడి ఆత్మహత్య
ప్రియరాలి ఇంట్లో పెళ్లికి వ్యతిరేకత వ్యక్తం చెయ్యడంతో ప్రేమికులు మనస్తాపం చెందారు. మనం కలిసి జీవించలేకపోయినా కలసి ఆత్మహత్య చేసుకుందామని శక్తివేల్, అతని ప్రియురాలు మాట్లాడుకున్నారు. ఆరణి సమీపంలోని వడమాటిమంగళం రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లిన శక్తివేల్, అతని ప్రియురాలు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి నుంచి తిరువణ్ణామలై వెళ్తున్న హైస్పీడ్ రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వేగంగా రైలు ఢీకొనడంతో శక్తివేల్, అతని ప్రియురాల శరీరాలు ముక్కలు ముక్కలు అయ్యాయి. తెలిసి తెలియని వయసులో ప్రేమించుకుని పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ప్రేమికులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications