పన్నీర్ కు పళనిసామి ప్రభుత్వం సవాల్: కేసు వెనక్కి తీసుకుంటేనే !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు మంత్రి సీబీ షణ్ముగం ఇప్పుడు పన్నీర్ సెల్వం వర్గం ముందు మరో కొత్త డిమాండ్ పెట్టి రెండు వర్గాల నాయకుల మద్య చర్చలకు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మొదట మా డిమాండ్ ను అంగీకరిస్తే చర్చలకు సిద్దం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాలు ఒక్కటి కావాలని ఓ పక్క ప్రయత్నాలు జరుగుతుంటే మరో పక్క రెండు వర్గాల్లోని సీనియర్ నాయకులు ఒకరిమీద ఒకరు బురద చల్లుకుంటున్నారు. ఇప్పుడు ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వంలోని ఓ సీనియర్ మంత్రి కొత్త డిమాండ్ ను తెరమీదకు తీసుకు వచ్చి పన్నీర్ సెల్వం వర్గానికి సవాలు విసిరారు.

ఆ విషయంలోనే ఇప్పుడు

ఆ విషయంలోనే ఇప్పుడు

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ ఎన్నిక చెల్లదని పన్నీర్ సెల్వం వర్గంలోని నాయకులు భారత ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. శశికళను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని ఎన్నికల కమిషన్ కు మనవి చేశారు.

రెండాకుల గుర్తు మాకే ఇవ్వాలని

రెండాకుల గుర్తు మాకే ఇవ్వాలని

మాదే అసలైన అన్నాడీఎంకే పార్టీ అంటూ శశికళ వర్గం, పన్నీర్ సెల్వం వర్గం ఎన్నికల కమిషన్ ముందు వాదించాయి. రెండాకుల గుర్తు మాకే కేటాయించాలని పోటీ పడ్డారు. రెండు వర్గాల నుంచి వివరణ తీసుకున్న ఎన్నికల కమిషన్ ఇప్పుడు తుది నిర్ణయం తీసుకోవడానికి సిద్దం అవుతోంది.

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో

రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలని ఇరు వర్గాలు పట్టుపట్టడంతో ఎన్నికల కమిషన్ ఎవ్వరికీ ఆ గుర్తు ఇవ్వకుండా రిజర్వులో పెట్టింది. ఇరు వర్గాల గొడవ ఫలితంగా ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో వేర్వేరు గుర్తులతో పోటీకి దిగారు.

పన్నీర్ సెల్వంకు సవాలు

పన్నీర్ సెల్వంకు సవాలు

గురువారం రాత్రి తమిళనాడు సీనియర్ మంత్రి సీవీ షణ్ముగం మీడియాతో మాట్లాడుతూ మీరు ఎన్నికల కమిషన్ కు చేసిన ఫిర్యాదు వెనక్కి తీసుకుంటే చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని పన్నీర్ సెల్వం వర్గానికి సవాలు విసిరారు.

తరువాత చూద్దాం

తరువాత చూద్దాం


ఎన్నికల కమిషన్ దగ్గర ఫిర్యాదు వెనక్కి తీసుకుని వస్తే తరువాత చర్చల గురించి మాట్లాడుదాం అంటూ మంత్రి సీవీ షణ్ముగం సంచలన వ్యాఖ్యలు చెయ్యడంతో ఇన్ని రోజులు రెండు వర్గాలు ఒక్కటి కావాలనుకుంటున్న సీనియర్ నాయకులు మండిపడుతున్నారు.

అంగీకరించరు

అంగీకరించరు

ఎన్నికల కమిషన్ దగ్గర ఫిర్యాదు వెనక్కి తీసుకోవడానికి పన్నీర్ సెల్వం వర్గం ఎలాంటి పరిస్థితిలో అంగీకరించదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎదైనా ఎన్నికల కమిషన్ దగ్గరే తేల్చుకుందాం అనే రీతిలో పన్నీర్ సెల్వం వర్గం సిద్దం అయ్యింది.

ఏం చెయ్యాలో తెలీదు

ఏం చెయ్యాలో తెలీదు

రెండు వర్గాల నాయకులు ఒకరిమీద ఒకరు కారాలు మిరియాలు నూరుకోవడంతో ఇప్పుడు ఏం చెద్దాం అంటూ రాయభారానికి పావులుకదిపిన నాయకులు ఆలోచనలో పడ్డారు. శుక్రవారం అయినా రెండు వర్గాల చర్చలు ఓ కొలిక్కి వస్తాయో రావో వేచి చూడాలి అంటున్నారు అన్నాడీఎంకే కార్యకర్తలు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil Nadu Minister CV Shanmugam urges that OPS team should withdraw their case from election commission. all should work for the party CV shanmugam said.
Please Wait while comments are loading...