కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు: లేడీ ప్రొఫెసర్ అపద్దాలు, కోర్టులో నిజాలు చెప్తా !
చెన్నై: కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పి వారిని వ్యభిచారంలోకి దింపాలని ప్రయత్నించిన తమిళనాడులోని అరుప్పుకోటై లేడీ ప్రొఫెసర్ నిర్మలాదేవి అన్నీ అపద్దాలు చెబుతున్నారని మదురై కామరాజర్ యూనివర్శిటి అసిస్టెంట్ ప్రొఫెసర్ మరుగన్ ఆరోపిస్తున్నారని పోలీసులు అంటున్నారు.
మదురై కామరాజర్ యూనివర్శిటికి చెందిన కొందరు ప్రొఫెసర్ల లైంగిక కోరిక తీర్చితే పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తారని, మీ బ్యాంకు అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ చేస్తారని, తాను చెప్పినట్లు వినాలని కాలేజ్ అమ్మాయిలకు లేడీ ప్రొఫెసర్ నిర్మలా దేవి సెక్స్ పాఠాలు చెప్పారని కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారం బయటకు రావడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవితో సహ మదురై కామరాజర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మురుగన్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో నిర్మలా దేవి, మరుగన్ అనేక విషయాలు వెల్లడించారని పోలీసులు అంటున్నారు.

ఈ కేసులో నిర్మలా దేవి కింగ్ పిన్ అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణలో నిర్మలా దేవి అంతా తప్పుడు సమాచారం ఇచ్చిందని మురుగన్ సైతం ఆరోపణలు చేస్తున్నారని ఓ పోలీసు విచారణ అధికారి అంటున్నారు.
నిర్మలా దేవి వ్యవహారంలో తాను అసలు నిజాలు న్యాయస్థానంలో చెబుతానని మదురై కామరాజర్ యూనివర్శిటి ప్రొఫెసర్ మురుగన్ చెబుతున్నాడని ఓ పోలీసు అధికారి అంటున్నారు. కాలేజ్ అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి దింపడానికి ప్రయత్నించిన నిర్మలా దేవి వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వం సీరియస్ గా ఉంది.
ఇప్పటికే నిర్మలా దేవి వ్యవహారంపై విచారణ చేస్తున్న సిట్ అధికారులు కాలేజ్ అమ్మాయిలు, సిబ్బందితో పాటు అనేక మందిని విచారణ చేసి వివరాలు సేకరించారు. నిర్మలా దేవిని కఠినంగా శిక్షించాలని పలు సంఘ, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications