Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తలాక్.. తలాక్.. తలాక్.. పొగాకు తెచ్చిన తంటా

లక్నో : వారి పచ్చని సంసారంలో పొగాకు చిచ్చుపెట్టింది. పొగాకు పడని భర్తకు .. భార్య వాడటంతో కోపమొచ్చింది. అతనిపై కట్నం ఆరోపణలు చేసింది భార్య. దీంతో వారిద్దరూ సంసారం పోలీసు స్టేషన్‌కు చేరింది. విచారణ చేపట్టిన పోలీసులు విడిపోయేందుకు భర్త సిద్ధమయ్యాడనే అంశాన్ని తేల్చారు. కానీ కట్నం ఆరోపణలను తోసిపుచ్చారు.

లక్నోలోని మసౌలీ పోలీసు స్టేషన్ పరిధిలో మహ్మద్ వైస్, అతని భార్య హసిన్ బానో ఉంటున్నారు. వీరి కాపురం సజావుగానే సాగుతుంది. అయితే ఇటీవల భర్తకు కట్నం పిచ్చి పట్టుకుందని భార్య చెబుతోంది. బైక్, కట్నం తేవాలని వేధిస్తున్నాడని తెలిపింది. ఆమె పొగాకు అలవాటు బజారుకీడ్చింది. పొగాకు అంటే పడని భర్త చివరకు ఆమెతో విడిపోయేందుకు సిద్ధమయ్యాడు.

tobacco cause to talaq in lucknow

ఇక తనతో ఉండలేనని తనకున్న బ్రహ్మస్త్రం తలాక్ ప్రయోగించాడు మహ్మద్. పొగాకు అంటే తనకు పడదని, అయినా పొగాకు పళ్లు తోముకుంటుందని వింత కారణం చెప్పి తలాక్ తలాక్ తలాక్ అని చెప్పేశాడు. దీంతో అతని భార్య విస్తుపోయింది. తనకు జరిగిన అన్యాయంపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అంతేకాదు కట్నం గురించి వేధిస్తున్నారని వాపోయారు. దీనిపై మహ్మద్‌ను మీడియా ప్రతినిధులు వివరణ అడిగితే .. తన భార్య పొగాకుకు బానిసైందని చెప్పారు. అంతేకాదు తాను మార్కెట్ నుంచి పొగాకు తేకుంటే తన పని అంతేనని పేర్కొన్నారు. ఆమె వేధింపులు భరించలేనని వివరించారు. అయితే అదనపు కట్నం, బైక్ ఆరోపణలు సత్యదూరమని, అదేం లేదని పేర్కొన్నారు. భర్త తలాక్ చెప్పంది నిజమేనని తెలిపారు పోలీసులు. కానీ అదనపు కట్నం అనేది ఆరోపణలేనని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+