ఉల్లి తర్వాత టమాట... ఆకాశనంటుతున్న ధరలు

ఇటివల ఉల్లి ధరలు పెరిగి సామాన్యుని కంటిలో కొయకుండానే కన్నీరు తెప్పిస్తున్న పరిస్థితి నెలకొంది. ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తుండడంతో దేశవ్యాప్తంగా ఆకాశాన్నింటిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా సామాన్యునికి అందుబాటులో ఉండే టమాట ధరలు సైతం ఆకాశనంటుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ మొదలుకుని పలు రాష్ట్రాల్లో కిలో రూ. 50 పైనే టమోట ధరలు చేరుకున్నాయి. రానున్న రోజుల్లో ఉల్లితో పాటు టమాట ధర కూడ ఇంకా పైకి ఎగబాకే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉత్తరాదిన కురిసిన వర్షాలు సామాన్యప్రజలను ఇబ్బందుకు గురి చేస్తున్నాయి. మెజారీటి ప్రజలకు అందుబాటులో ఉండే ఉల్లిగడ్డ సరసన టమాట కూడ చేరింది. దీంతో ఢిల్లీలో కిలో టమోటో ధర 40 నుండి 60 రూపాలయకు చేరుకుంది. ఇప్పటికే ఉల్లిధరలు ఆకాశాన్ని తాకాయి. కిలో రూ. 50 మేర బహిరంగ మార్కెట్లో పలుకుతోంది. దీంతో కేంద్రంతో పాటు పలు రాష్ట్రప్రభుత్వాలు సైతం రంగంలోకి దిగాయి.

Tomatoes are next in line to hike the rates

సామాన్యులకు అందుబాటులో ఉండే ఉల్లిగడ్డ, టమోటో ధరలు పెరగడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదలతో నెలవారి కిచెన్ బడ్జెట్ పెరుగుతుందని చెప్పారు. మహారాష్ట్రతోపాటు కర్ణాటక రాష్ట్రాల నుండి దిగుమతి కావల్సిన టమాట వర్షాల కారణంగా దిగబడి తగ్గిపోయింది. దీంతో రోజువారి కంటే తక్కువగా వస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రోజువారిగా వచ్చే టమాటలో మూడో వంతు కూడ మార్కెట్‌కు రావడం లేదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+