ఆ రాష్ట్రాల్లో "మందు బాబు"లను బీట్ చేసిన "మందు భామలు".. ఏవేవంటే ?

"మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం" మద్యం బాటిళ్లపై ఈ హెచ్చరికను మనం చూడొచ్చు. ఆరోగ్యం పరంగా, సామాజికంగా, కుటుంబపరంగా ఎంతో మంది జీవితాలు మద్యానికి బానిసలు కావడం వల్లే చిన్నాభిన్నం అయ్యాయి. సినిమాల్లోనూ, పలు యాడ్స్ లోనూ మాత్రమే కాకుండా వైద్యులు సైతం ఈ అలవాటుకు దూరంగా ఉండాలని సూచిస్తారు. అయితే ఇంత కాలం మందు బాబులను చూస్తున్న తరుణంలో మగవారికి ఏ విషయం లోనూ మేము తగ్గం అంటూ ఇక్కడ కూడా పోటీకి వస్తున్నారు మహిళలు.

ఇప్పటి వరకు మద్యం సేవించే విషయంలో మందుబాబులు మాత్రమే అధికంగా కనిపించేవారు. కానీ తాజాగా వెలువడిన నివేదికలు చూస్తే.. మందుబాబులకు పోటీగా నిలుస్తున్నారు మందు భామలు. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మద్యం సేవిస్తున్న మహిళల శాతం ఆశ్చర్యకరంగా పెరిగింది. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, స్వేచ్ఛాపరమైన ఆలోచనల పెరుగుదల సహా పలు విషయాలను ఇందుకు కారణాలుగా పరిగణిస్తున్నారు. కొంతవరకు సాంస్కృతిక ఆచారాల ప్రభావం కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

top-5-states-in-india-with-high-percentage-of-female-liquor-addicts

ఇండియన్ ఆల్కహాల్ సర్వే-2025 మరియు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) 2019-21 ఆధారంగా కొన్ని రాష్ట్రాల్లో మహిళల్లో మద్యం వినియోగం అత్యధికంగా ఉండటం గమనార్హం. ఈ రాష్ట్రాల వివరాలు చూస్తే షాక్ అవ్వడం ఖాయం అనిపిస్తుంది. ఇండియాలో అత్యధికంగా మద్యం సేవిస్తున్న మహిళలు ఉన్న టాప్ 5 రాష్ట్రాలు లిస్ట్ పరిశీలిస్తే..

1. అరుణాచల్ ప్రదేశ్ - 24.2%
2. సిక్కిం - 16.2%
3. అస్సాం - 7.3%
4. తెలంగాణ - 6.7%
5. జార్ఖండ్ - 6.1%

అలానే అండమాన్ & నికోబార్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లోనూ మద్యం వినియోగంలో మహిళల శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం కొంత భిన్నంగా ఉంది. ఇక్కడ మహిళల్లో మద్యం వినియోగం అత్యల్పంగా ఉండడం కాస్తా ఊరటని ఇచ్చే విషయం అని చెప్పాలి. ఇది ఒక సానుకూల పరిణామంగా చెప్పుకోవచ్చు.

కానీ తెలంగాణలో మాత్రం ఈ పెరుగుదల రానున్న రోజుల్లో మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఈ తరహా ధోరణికి పలు అవగాహన కార్యక్రమలా ద్వారా అడ్డుకట్ట వేయాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. అంతే కాకుండా మద్యం సేవించడం వల్ల మహిళలకు కలిగే నష్టాల్లో గర్భధారణల సమస్యలు ఎక్కువగా ఉంటాయని వెల్లడిస్తున్నారు.

top-5-states-in-india-with-high-percentage-of-female-liquor-addicts

మద్యం వినియోగం పెరగడానికి కారణాలు..

ఒత్తిడికి లోనవ్వడం

ఉద్యోగ, కుటుంబ బాధ్యతల నుంచి బయటపడే మార్గంగా భావించడం

ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాల ప్రభావం

సరదా, ఉత్సాహానికి మద్యం ఉపయోగించడం

పబ్ కల్చర్, పార్టీలు, సోషల్ మీడియా ప్రభావం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+