తమిళనాడు సీఎం ఇంట్లో విషాదం.. ఎంకే స్టాలిన్ బావ మృతి..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్టాలిన్ బావ, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మేనల్లుడు మురసోలి సెల్వం మృతిచెందారు. మురసోలి నిన్న (గురువారం) బెంగుళూరులో గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.
ఈ విషయం తెలుసుకున్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి హుటాహుటిన బెంగుళూరుకు బయలుదేరారు. మురసోలి సెల్వం భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈయన గతంలో తమిళ దినపత్రిక అయిన మురసోలికి ఎడిటర్‌గా పని చేశారు. ఈ పత్రిక ద్వారా ఆ పార్టీకి సంబంధించిన అన్ని విషయాలను ప్రజలకు చేరవేసేవారు.
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి మేనల్లుడు అయిన మురసోలి కరుణానిధి కుమార్తె సెల్విని పెళ్లి చేసుకున్నారు. మురసోలి సెల్వం కేంద్ర మాజీ మంత్రి మురసోలి మారన్‌కు స్వయానా తమ్ముడు. మురసోలి పత్రిక ద్రవిడ మున్నేట్ర కజగం-డీఎంకే పార్టీ అధికారిక గొంతుకగా ప్రసిద్ధిచెందింది. కరుణానిధి ఆలోచనలను జర్నలిజంలో మురసోలి సెల్వం చేసిన సేవలను ఎంకే స్టాలిన్, డీఎంకే పార్టీ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది.

మురసోలి సెల్వం మృతికి సంతాపంగా డీఎంకే పార్టీ 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ సందర్భంగా స్టాలిన్ మురసోలీ సెల్వం గురించి తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చిన్నప్పటినుంచే మురసోలీ సెల్వం తనకు మార్గనిర్దేశం చేశారని ఈ సందర్బంగా సీఎం స్టాలిన్ గుర్తు చేసుకున్నారు. తనకు అన్ని విషయాల్లో సలహాలు సూచనలు అందించేవారని పేర్కొన్నారు. తాను డీఎంకే అధినేతగా ఎదగడంలో మురసోలి సెల్వం పాత్ర ఎంతో ఉందని ఈ సందర్భంగా తెలిపారు. తను భుజం తట్టి ప్రోత్సహించినట్లు వివరించారు. మురసోలి సెల్వం మృతి పట్ల చెన్నై ప్రెస్ క్లబ్ తీవ్ర సంతాపం ప్రకటించింది. మురసోలి సెల్వంకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications