పదివేలు పందెం.. నీళ్లు కలపకుండా ఐదు బాటిళ్ల మద్యం తాగి.. చివరికి
ఫ్రెండ్స్ మధ్య బెట్టింగ్ సర్వసాధారణం. అవి వారి స్నేహాన్ని దృఢంగా చేస్తాయి కూడా. కానీ ఏదైనా శృతి మించితేనే ప్రమాదం. ఇక్కడ కూడా అలానే జరిగింది. ఫ్రెండ్స్ మధ్య జరిగిన ఓ టైమ్ పాస్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన కర్ణాటకలో జరిగింది. సరదాకు అయినా బెట్టింగ్, పందేలు ఎంత ప్రమాదమో ఈ యథార్థ సంఘటనతో అర్థమవుతోంది.
కర్ణాటకలోని కోలార్ జిల్లాలో 21 ఏళ్ల యువకుడు రూ. 10,000 రూపాయల పందెం కోసం ఐదు మద్యం బాటిళ్లు తాగి మరణించిన ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నీరు కలపకుండా మద్యం తాగడం వల్ల అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఏం జరిగిందంటే..
కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన 21 ఏళ్ల కార్తీక్ స్నేహితులతో కలిసి సరదాగా రూ.10వేలు పందెం వేశాడు. అతను మద్యంలో నీటిని కలపకుండా నేరుగా 5 బాటిళ్లు తాగుతానని చెప్పాడు. వెంకట రెడ్డి అనే స్నేహితుడు కార్తీక్ అలా మద్యం తాగితే రూ.10,000 రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశాడు. అలా నీరు కలపకుండా 5 బాటిళ్ల మద్యం తాగాడు. ఆ తర్వాత అతిగా మద్యం సేవించడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కార్తీక్ ను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కార్తీక్ శరీరం చికిత్సకు స్పందించకపోవడంతో ఆసుపత్రిలోనే మరణించాడు. నీరు కలపకుండా అతిగా మద్యం తాగడం వల్ల అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఇక కార్తీక్ కు ఏడాది క్రితమే పెళ్లి జరిగినట్లు సమాచారం. కార్తీక్ భార్య ప్రెగ్నెంట్ కావడంతో ఆమె వాళ్ల తల్లి వద్దకు పంపించాడు. ఆ తర్వాత మద్యానికి బానిసయ్యాడు కార్తీక్. ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చిన భార్య 8 రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు అతడి భార్య చిన్న వయసులోనే భర్తను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా కన్నీరుమున్నీరు అయ్యారు.
-
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications