వైరల్ వీడియో: ఛీ.. ఛీ..అది రైలా.. లేక ఓయో రూమా..!
సాధారణంగా దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వాళ్లు రైలులో ప్రయాణిస్తుంటారు. తక్కువ ధరకు రైలులో ప్రయాణించవచ్చన్న కారణంతో నిత్యం వేలాదిమంది ప్రయాణికులు ట్రైన్స్ లో జర్నీ చేస్తుంటారు. దేవస్థానాలు, సుదూర ప్రాంతాలకు ట్రిప్ లు వేస్తుంటారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా రైలులో ప్రయాణిస్తుంటారు.
OYO Train
— दिव्या कुमारी (@divyakumaari) September 6, 2025
ऐसे लोगों ने अब टट्रैन को भी oyo बना दिया 🤦♀️🤦♀️ pic.twitter.com/ZZCZ3nADdj
అలాంటి రైలులో యువత పాడు పనులు చేస్తోంది. అడ్డూ అదుపు లేకుండా పబ్లిక్ గానే కానిచ్చేస్తున్నారు. కనీసం తమను ఎవరో వీడియో తీస్తున్నారు అన్న విచక్షణం కూడా లేకుండా రొమాన్స్ లో మునిగిపోతున్నారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. పబ్లిక్ ప్లేస్ ల్లో ఇలాంటి పనులు ఏంటీ అని కామెంట్స్ చేస్తున్నారు.
యువత రానురాను మరీ బరితెగిస్తోంది. రీల్స్, సోషల్ మీడియా ఉచ్చులో పడి బలవుతోంది. ఏం చేస్తున్నామో.. ఎందుకు చేస్తున్నామో తెలియకుండా పోయింది. ఓ రైలులో చుట్టూ ప్రయాణికులు నడుస్తున్నా.. ఓ జంట మాత్రం రొమాన్స్ లో మునిగిపోయింది. తోటి ప్రయాణికులు ఏమనుకుంటారు అన్న జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించింది ఆ జంట.

దీనిపై నెటిజెన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. రైలును ఓయో రూమ్ చేశారంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఓయో ట్రైన్ అంటూ మండిపడుతున్నారు. అధికారులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications