ఇళ్లు, షాపుల మధ్య నుంచి వెళ్లే రైలు ఇదొక్కటే!
వియత్నాంలోని హనోయ్ గురించి ఎవరికైనా చెప్పాలంటే..అది అగరబత్తుల తయారీ గ్రామం అని చెబుతారు. హనోయ్ ప్రసిద్ధి చెందడానికి ఇదొక్కటే కారణం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విషయం మరొకటి ఉంది. ఈ గ్రామంలో ఇళ్లు, దుకాణాల గుండా ఒక రైలు వెళుతుంటుంది. కొన్నిచోట్ల ఇంటికీ, రైల్వే ట్రాక్ కు మధ్య చాలా తక్కువ దూరమే ఉంటుంది. రైలు వస్తుంటే తమ ఇంటిముందున్న తలుపులు మూసేస్తారు. వియత్నాంలోని అత్యంత ప్రత్యేకమైన ప్రదేశం ఇదే. అందుకే రైలు వీధిగా ప్రసిద్ధి పొందింది.
వియత్నాం దేశంలో అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రదేశంగా హనోయ్ ఖ్యాతి తెచ్చుకుంది. ఇక్కడక వచ్చినవారు సెల్ఫీ తీసుకోకుండా వెళ్లరు. పర్యాటకుల భద్రత గురించి ఆందోళన చెందుతారు. రైలు ట్రాక్‌లపై కూర్చుని లేదా రైలు ట్రాక్‌పై పడుకుని ఫోటోలు తీసుకుంటుంటారు.

ఇక్కడ నివసించే ప్రజలు రైలు రావడానికి ముందే తమ సామాన్లు తీసేస్తుంటారు. రోజులో ఇలా చాలాసార్లు జరుగుతుంటుంది. పర్యాటకం పెరగడంతో ఇక్కడ నివసించేవారంతా తమ ఇళ్లను చిన్న కేఫ్ లుగా మార్చుకున్నారు. స్థానికంగా అన్ని ప్రాంతాలు తెలిసిన గైడ్లు పర్యాటకులకు తోడ్పడుతుంటారు.
Hanoi's train street. pic.twitter.com/8WcRPXN1QD
— CCBaxter 🌍 (@juapersan) April 5, 2023












Click it and Unblock the Notifications