కుప్పకూలిన విమానం: మహిళా ట్రైనీ పైలట్, శిక్షకుడు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘాట్ ప్రాంతంలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఓ చార్టర్డ్ విమానం కుప్పకూలడంతో అందులోని ఓ మహిళా పైలట్ తోపాటు శిక్షకుడు మరణించారు. ఈ ప్రమాదం శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
బాలాఘాట్‌లోని కిర్నాపూర్ హిల్స్‌లోని భక్కు తోలా గ్రామంలో విమానం కూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. వీరిలో ఒక ట్రైనీ మహిళా పైలట్ రుక్షాంక, విమానం శిక్షకుడు మోహిత్ కుమార్‌లుగా గుర్తించామని బాలాఘాట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సమీర్ సౌరభ్ తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలోని బిర్సీ విమానాశ్రయం నుంచి శనివారం మధ్యాహ్నం ఈ విమానం బయలుదేరింది.బిర్సీ ఎయిర్‌స్ట్రిప్ కంట్రోలర్ కమలేష్ మెష్రామ్ సంఘటనను ధృవీకరిస్తూ.. వారి చివరి ప్రదేశం బాలాఘాట్‌లోని కిర్నాపూర్‌లో మధ్యాహ్నం 3.45 గంటలకు గుర్తించినట్లు పేర్కొన్నారు.
Ohh My God..!
— Govind Gurjar (@Gurjarrrrr) March 18, 2023
Plane Crash in MP's Balaghat
Trainee Pilot and Captain (instructor) no More in the Crash
Crash happened in Bhakkutola forest of Kirnapur police station area in Balaghat MP.
Trainee Pilot Rukshanka and instructor Mohit no more in the crash
More info awaited pic.twitter.com/KmWObE1W7b
'ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు, అయితే శనివారం బాలాఘాట్‌లో వడగళ్ళు తుఫాను సంభవించినందున ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చు' అని సదరు అధికారి తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications