ఇదేమీ వింత: తన వీర్యంతో తానే తల్లీ: ఓ ట్రాన్స్‌జెండర్ వైద్యుడి అద్భుతం..?
ఈ సృష్టిలో ఏ బిడ్డకైనా తల్లీ తండ్రీ ఇద్దరు ఉంటారు. ఒకే బిడ్డకు తల్లీ తండ్రీ ఒక్కరే కాలేదు. ఓ డాక్టర్‌కు వచ్చిన అద్భుతమైన ఆలోచన ఇదీ. తన బిడ్డకు తానే తల్లీతండ్రీ అవ్వాలనుకున్నాడు. తన వీర్యంతో తానే గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చి తల్లి కావాలనుకున్నాడు. మగాడుగా పుట్టిన ఓ వ్యక్తి తన వీర్యాన్ని భద్ర పరిచి అనంతరం తాను స్త్రీగా మారి తాను భద్రపరిచిన వీర్యంతోనే తాను గర్భం దాల్చాలని ఓ డాక్టర్ అంటున్నాడు.

వీర్యాన్ని భద్రపరచి..
అహ్మదాబాద్‌కు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ డాక్టర్ తన వీర్యాన్ని తాను పురుషుడిగా ఉండగానే భద్రపరిచింది. తర్వాత అదే వీర్యంతో తానే తల్లి కూడా అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. డాక్టర్ జెస్నూర్ డయారా గోద్రాలో గల పంచమహల్‌లో జన్మించింది. పుట్టినప్పుడు పురుషుడిలా అంగాలతో పుట్టింది. ఓ పురుషుడికి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్‌తో ఉంది.

స్త్రీ లక్షణాలు కనిపించడంతో..
వయసు వచ్చే కొద్దీ తనలో స్త్రీ లక్షణాలు పెరుగుతుండడం గుర్తించింది. తానో ట్రాన్స్‌జెండర్ అని తెలిసొచ్చింది. దీంతో స్త్రీగా మారిపోవాలని నిర్ణయించుకుంది. కానీ స్త్రీగా మారిన తరువాత తాను తల్లిని కావాలని అనుకుంది. అదికూడా వేరే వ్యక్తి బిడ్డకు కాకుండా తన బిడ్డకే తాను తల్లిని అవ్వాలనుకుంది. ఆ బిడ్డకు తండ్రి..తల్లీకూడా తానే కావాలని అనుకుంది.

అత్యంత అరుదు..
ఇటీవల రష్యన్ వర్శిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీని సంపాదించిన డాక్టర్ కాబట్టి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంది. తన వీర్యాన్ని భద్రపరిచాడు. ఆనంద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్‌లో తన వీర్యాన్ని క్రయోజనిక్ పద్ధతిలో భద్రపరిచాడు. స్త్రీగా మారిన తరువాత ఈ వీర్యాన్ని వినియోగించి బిడ్డను కనాలని భావిస్తోంది. త్వరలో సర్జరీతో ఆమె పూర్తిగా స్త్రీగా మారిపోబోతోంది. శస్త్ర చికిత్స పూర్తయిన తరువాత, ఈ వీర్యంతో ఆమె తల్లి కానుంది.

డయారా రికార్డు
అదే జరిగితే ఒక బిడ్డకు తల్లి, తండ్రి తానే అయిన ఏకైక వ్యక్తిగా డయారా రికార్డు సృష్టించనుంది. డాక్టర్ డయారా ఇటీవలే రష్యాకు చెందిన మెడికల్ వర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. దీని ద్వారా గుజరాత్‌లో తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్‌గా రికార్డు సృష్టించారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications