Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అసెంబ్లీలో పోర్న్ వీడియో చూస్తూ బీజేపీ ఎమ్మెల్యే మస్త్ మజా

అగర్తలా: ముసలోడే గానీ మహానుభావుడు అనేది ఓ సినిమా డైలాగ్. భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ సీనియర్ శాసన సభ్యుడు మహానుభావుడే అనిపించుకున్నాడు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న దశలో సభలో ఉంటూ తన మొబైల్ ఫోన్‌లో పోర్న్ వీడియోలను చూస్తూ ఎంజాయ్ చేశాడా ఎమ్మెల్యే. పైగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూడా. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ ఎమ్మెల్యే పేరు జాదవ్ లాల్ నాథ్. త్రిపురలోని బగ్‌బస్సా నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. బగ్‌బస్సా స్థానంలో తన సమీప ప్రత్యర్థి, సీపీఎంకు చెందిన బిజిత నాథ్ ను ఓడించారు. 1,461 ఓట్ల తేడాతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈ ఎన్నికల తరువాత త్రిపురలో బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి మాణిక్ సాహా సారథ్యంలోని తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలపై వాడివేడిగా చర్చ కొనసాగుతోండగా.. జాదవ్ లాల్ నాథ్ మాత్రం తన మొబైల్ ఫోన్ లో పోర్న్ వీడియోలను చూస్తూ ఎంజాయ్ చేశారు. ఆయన వెనకలే కూర్చున్న తోటి ఎమ్మెల్యే ఒకరు ఈ తతంగం మొత్తాన్నీ తన కెమెరాలో రికార్డ్ చేశారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. జాదవ్ లాల్ బండారాన్ని బయటపెట్టింది.

దీనిపై త్రిపుర బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు స్పందించారు. ఆయనకు షోకాజ్ నోటీసులను పంపించినట్లు తెలిపారు. షోకాజ్ నోటీసులను పంపించామని, అసెంబ్లీలో పోర్న్ వీడియో చూడటంపై సంతృప్తికర వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. తనపై వచ్చిన ఈ ఆరోపణలపై జాదవ్ లాల్ ఇంకా స్పందించలేదు. అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న విలేకరులు ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పటికీ- ఆయన నోరు విప్పలేదు. సభ వాయిదా పడిన వెంటనే ఆయన బయటికి వెళ్లిపోయారు.

Tripura BJP MLA Jadav Lal Nath watching porn on his mobile phone in the state assembly session

అసెంబ్లీలో పోర్న్ వీడియోలను చూస్తూ బీజేపీకి చెందిన నాయకులు రెడ్ హ్యాండెడ్ గా దొరకడం ఇది తొలిసారి కాదు. 2012లో కర్ణాటక అసెంబ్లీలో అప్పటి బీజేపీ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు మంత్రులు లక్ష్మణ్ సవాది, సీసీ పాటిల్ తమ మొబైల్ ఫోన్‌లలో పోర్న్ వీడియోలు, అశ్లీల క్లిప్‌లను చూస్తూ దొరికిపోయిన విషయం తెలిసిందే. దాని తరువాత వారిద్దరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+