Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలీస్‌స్టేషన్‌లో లీడర్ దౌర్జన్యం.. అపొజిషన్ కార్యకర్తపై దాడి (వీడియో)

అగర్తలా : లీడర్ రెచ్చిపోయాడు. అపొజిషన్ పార్టీ కార్యకర్తపై దాడి చేశాడు. ఇది ఎక్కడో బయటి ప్రాంతంలో జరగలేదు. సాక్షాత్తు పోలీసుల ఎదుటే.. ఠాణాలో జరగడం గమనార్హం. అందుకే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరలయింది. ఎన్నికల వేళ త్రిపుర కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రద్యోత్‌ దేవ్‌ బర్మన్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన సోదరి ప్రగ్యా దేవ్ బర్మన్ కాన్వాయ్ పై బీజేపీ అలయెన్స్ లోని ఐపీఎఫ్‌టీ పార్టీకి చెందిన కార్యకర్త దాడి చేశాడు. దాంతో సదరు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. విషయం తెలిసి ఠాణాకు చేరుకున్న ప్రద్యోత్ దేవ్ బర్మన్ వచ్చీరాగానే కోపోద్రిక్తులయ్యారు.

Tripura cong president slaps man inside police station

స్టేషన్ లో ఓ పక్కన కూర్చున ఆ యువకుడు ప్రద్యోత్ రాగానే లేచి నమస్కరించాడు. అయితే అప్పటికే కోపంతో ఊగిపోతున్న ప్రద్యోత్ ఆయన చెంపపై కొట్టాడు. వెంటనే అక్కడి పోలీసులు జోక్యం చేసుకుని నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఏ మాత్రం తగ్గని ప్రద్యోత్ తిట్ల పురాణం అందుకున్నాడు. బీజేపీ భయానక పరిస్థితులు సృష్టించడానికి తన సోదరి కాన్వాయ్ పై దాడి చేయించిందని ఆరోపించారు. ఆమె వాహన శ్రేణిపై జరిగిన దాడి బాధాకరమని వ్యాఖ్యానించారు. అదలావుంటే తనను అరెస్ట్ చేసినా భయపడేది లేదంటూ చెప్పుకొచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+