కమలనాథులకు కఠిన సమయం..!!

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. పీపుల్స్ పల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ వివరాలిలా ఉన్నాయి.

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇంకాస్సేపట్లో వెలువడనున్నాయి. కిందటి నెల 16వ తేదీన త్రిపుర, 27వ తేదీన మేఘాలయా, నాగాలాండ్ అసెంబ్లీ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇవ్వాళ ఓట్ల లెక్కింపు షెడ్యూల్ అయింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ తో ఓట్ల లెక్కింపు ఆరంభమౌతుంది. మధ్యాహ్నానికి ఈ మూడు రాష్ట్రాల్లో రాజెవరో.. బంటెవరో తేలిపోతుంది.

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు, పారా మిలటరీ బలగాలను మోహరింపజేశారు. త్రిపుర ఓట్ల లెక్కింపు- రాజధాని అగర్తలాలోని ఉమాకాంత అకాడమీ కాంప్లెక్స్ లో జరుగనుంది. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ విజయోత్సవాలను నిర్వహించడానికి ఆయా పార్టీలు కూడా సన్నద్ధమయ్యాయి.

హంగ్ కు ఛాన్స్?

హంగ్ కు ఛాన్స్?

త్రిపురలో ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య 60. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 31. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉందిక్కడ. ఈ సారి హంగ్ అసెంబ్లీ ఏర్పడొచ్చంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీకి 18- 26 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. సీపీఎం, ఇతర లెఫ్ట్ పార్టీలకు 14-22, తిప్రా మోతా పార్టీకి 11-16 లభిస్తాయని పేర్కొన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకటి నుంచి మూడు స్థానాలకే పరిమితం కావొచ్చని తేలింది.

అతిపెద్ద పార్టీగా..

అతిపెద్ద పార్టీగా..

బీజేపీ- అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో తిప్రా మోతా పార్టీ కింగ్ మేకర్ గా వ్యవహరించవచ్చు. కొత్తగా ఏర్పడిన తిప్రా మోతా పార్టీ ఎవరికి మద్దతు ప్రకటిస్తే- వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని బీజేపీ జారవిడుచుకోలేకపోవచ్చు. ముఖ్యమంత్రి పదవి కోసం తిప్రా మోతా పార్టీ డిమాండ్ చేస్తే- బీజేపీ అందుకు అంగీకరిస్తుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది.

మేఘాలయాలోనూ..

మేఘాలయాలోనూ..

మేఘాలయాలో కూడా హంగ్ అసెంబ్లీ వస్తుందంటూ అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్. మేఘాలయలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్పీపీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం- ఇక్కడ ఎన్పీపీకి 17 నుంచి 26 సీట్లు లభిస్తాయి. టీఎంసీకి 10 నుంచి 14, యూడీపీకి 8 నుంచి 12, బీజేపీకి 3 నుంచి 8, కాంగ్రెస్ కి 3 నుంచి 5, ఇతరులు 4 నుంచి 9 సీట్లు రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ లో తేలింది.

నాగా బీజేపీ పట్టు నిలుపుకొనే అవకాశం

నాగా బీజేపీ పట్టు నిలుపుకొనే అవకాశం

నాగాలాండ్ లో కూడా 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 31. ఇక్కడా హంగ్ అసెంబ్లీ ఏర్పడొచ్చనే అంచనాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న ఎన్డీపీపీ పార్టీకి 20 నుంచి 27, బీజేపీకి 14 నుంచి 21, ఎల్జేపీకి 5 నుంచి 10 సీట్లు, ఎన్పీఎఫ్ కు 3 నుంచి 8, కాంగ్రెస్ కు 2 నుంచి 4, ఇతరులకు 2 నుంచి 4 సీట్లు వస్తాయి. 60 స్థానాలు ఉన్న నాగాలాండ్ లో అధికారాన్ని అందుకోవడానికి అవసరమైన సీట్ల సంఖ్య 31. ఎన్డీపీపీ, బీజేపీ కలిసి వరుసగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశం ఉందనేది ఎగ్జిట్ పోల్స్ అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+