ప్రేమించలేదని యువతి నగ్నచిత్రాలు నెట్‌లో పెట్టాడు
అగర్తాల: తనను ప్రేమించని కారణంగా మాజీ స్నేహితురాలి నగ్న చిత్రాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన త్రిపురకు చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ ప్రతిపాదనను నిరాకరించిందనే కోపంతో నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురకు చెందిన అరూప్ దేవ్ అనే యువకుడికి పశ్చిమబెంగాల్‌లోని మల్దా జిల్లాకు చెందిన ఓ యువతితో పరిచయమైంది. కొన్ని రోజుల తర్వాత దేవ్ ప్రేమ ప్రస్తావన తీసుకురావడంతో ఆమె నిరాకరించింది.

ద్వేషం పెంచుకున్న దేవ్ ఆమె నగ్న చిత్రాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ విషయంపై యువతి తల్లిడండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పశ్చిమబెంగాల్ సీఐడీ అధికారులు త్రిపురలో దేవ్‌ను అరెస్ట్ చేసి కోల్‌కతాకు తరలించారు. అరూప్‌కు చెందిన నాలుగు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను సీజ్ చేశారు.












Click it and Unblock the Notifications