వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ దెబ్బ: జాబ్స్‌పై ఇన్ఫోసిస్ బాటలో కాగ్నిజంట్

ట్రంప్ దెబ్బకి భారత ఐటి దిగ్గజ కంపెనీలు దిగి వస్తున్నాయి. అమెరికా స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో కాగ్నిజెంట్ కూడా దిగివచ్చింది.

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ దెబ్బకు ఐటి కంపెనీలు దిగి వస్తున్నాయి. అమెరికా స్థానికులకు తమ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటనలు చేస్తున్నాయి. ఆమెరికాలోని తమ కంపెనీలో స్థానికులకు 10 వేల ఉద్యోగాలు కల్పిస్తామని ఇన్ఫోసిస్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇన్ఫోసిస్ బాటలోనే మరో ఐటి దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ నడవడానికి సిద్ధపడింది. అంచనా వేసినదాని కన్నా ఉత్తమ ఫలితాలను కాగ్నిజెంట్ ప్రకటించింది. ఇదే సమయంలో అమెరికాలో ఉద్యోగ నియామకాల ప్రక్రియను పెంచుతామని ప్రకటించింది.

కాగ్నిజెంట్‌కు 75 శాతానికి పైగా రెవెన్యూ ఉత్తర అమెరికా నుంచే వస్తోంది. అయితే, క్లయింట్లకు సర్వీసులు అందించడదానికి ఎక్కువగా హెచ్-1బీ విసాలపై ఆధారపడి ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో దాదాపు 2 లక్షల 60 వేల మంది ఉద్యోగులు భారతదేశానికి చెందినవారే.

ట్రంప్ ఎఫెక్ట్ ఇలా...

ట్రంప్ ఎఫెక్ట్ ఇలా...

అమెరికా వీసా ప్రోగ్రామ్‌ను కఠినతరం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేయడంతో ఐటి కంపెనీలు, అవుట్ సోర్సింగ్ కంపెనీలు అమెరికా స్థానికలకు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వస్తున్నాయి. డెలివరీ సెంటర్లను పెంచడం ద్వారా, హెచ్-1బీ వీసాలపై ఆధారపడడం తగ్గించడం ద్వారా ఎక్కువగా అమెరికాలో నియామకాలు చేపట్టాలని కాగ్నిజెంట్ ప్లాన్ చేస్తోందని ఆ సంస్థ అధ్యక్షుడు రాజీవ్ మెహతా అనలిస్టులకు చెప్పారు.

సగతం తగ్గిన వీసా దరఖాస్తులు...

సగతం తగ్గిన వీసా దరఖాస్తులు...

నిరుటి కన్నా సగం శాతం వీసాలను అఫ్లై చేయడం తగ్గించామని, ఈ తగ్గింపులు మరింత పెంచుతామని రాజీవ్ మెహతా చెప్పారు. వీసాలపై ఆధారపడడాన్ని తగ్గించి స్థానికంగా నియామకాలను చేపడుతామని ఆయన చెప్పారు. నిరుడు ఈ కంపెనీ అమెరికాలో 2 లక్షల 61 వేల మంది ఉద్యోగులను నియమించుకుంది.

అదే బాటలో విప్రో కూడా...

అదే బాటలో విప్రో కూడా...

కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ కంపెనీలు ఇప్పటికే స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విషయంపై ప్రకటనలు చేయగా మరో దిగ్గజ ఐటి కంపెనీ విప్రో కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాలో ఈసారి ఎక్కువ నియామకాలు చేపట్టాలనే ఆలోచనలో ఆ కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది భారత్‌కు చెందిన ప్రముఖ ఐటి సంస్థలు తమ హెచ్-1బీ వీసాల దరఖాస్తులను తగ్గించాయి.

ఇంత మంది ఉద్యోగులు...

ఇంత మంది ఉద్యోగులు...

కాగ్నిజెంట్‌లో 2.61 లక్షల ఉద్యోగులు ఉన్నారు. వీరిలో చాలా మంది భారతీయులే. ఈ సంస్థ 2016లో 4 వేల మంది అమెరికా పౌరులను, నివాసితులను నియమించుకుంది. అయితే, తాము ఈ ఏడాది ఎన్ని హెచ్-1బీ వీసాలకు దరఖాస్తు చేసింది చెప్పడానికి రాజీవ్ మెహతా ఇష్టపడలేదు. అయితే, సగం తగ్గించామని మాత్రం చెప్పారు.

English summary
Talking about Cognizant's visa requirements, Mehta said the company is working on reducing its dependence on these work permits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X