హిల్లరీ క్లింటన్ గెలవదంట, ట్రంప్ గెలుస్తాడన్న 'చాణక్య'
చెన్నై: ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఎక్కువ సర్వేలు డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుస్తుందని చెబుతున్నాయి. ఒకటి రెండు మాత్రమే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నాయి. 90 శాతం హిల్లరీ వైపు మొగ్గు చూపుతున్నారని ఎన్నికలకు ముందు సర్వేల్లో వెల్లడైంది.
అయితే, దానికి అనుగుణంగానే తొలి ఫలితం వెలున్యూ హ్యాంప్‌షైర్‌లోని డిగ్జ్‌విల్లే నాచ్‌లో పోలింగ్ పూర్తయి ఫలితం వచ్చింది. ఇక్కడి ఎనిమిది ఓట్లలో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ నాలుగు ఓట్లు గెలుచుకోగా, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండు ఓట్లు గెలుచుకున్నారు.
దాదాపు సర్వేలన్నీ హిల్లరీదే విజయమని చెబుతుంటే 'చాణక్య' అనే చేప మాత్రం ట్రంప్ గెలుస్తారని చెబుతోంది. చాణక్య చిన్న చేప. చేపల ప్రేమికుడు ఆర్ వరుణ్ దీనిని ఇష్టంగా పెంచుకుంటున్నారు. గతంలో ఇది చెప్పిన జోస్యాలన్నీ చాలా వరకు నిజమయ్యాయట.

ప్రస్తుతం అమెరికా ఎన్నికలు ఆసక్తి రేపడంతో గెలిచేది ఎవరో తెలుసుకునేందుకు చాణక్యను ప్రయోగించారు. ఓ నీటి తొట్టెలో హిల్లరీ, ట్రంప్ ఫొటోలను పెట్టారు. అంతే చాణక్య వేగంగా ఈదుకుంటూ వెళ్లి ట్రంప్ ఫొటోను పట్టుకుంది. దీంతో ట్రంప్ గెలుపు ఖామని తేలిపోయిందంటున్నారు.
గతంలో ఈ చాణక్య చేప చెప్పిన పలు జోస్యాలు కూడా నిజమయ్యాయి. యూరోకప్‌లో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ గెలుస్తుందని చెప్పింది. అది నిజమైంది. 2015లో వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌లోనూ అది చెప్పిన జోస్యం నిజమైంది. దీంతో ఇప్పుడు ట్రంప్ గెలుపు కూడా తథ్యమని చెబుతున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ..












Click it and Unblock the Notifications